Begin typing your search above and press return to search.

టైటానిక్ డికాప్రియోతో కాదు ఆయ‌న ఫ్రెండుతో డేటింగ్!

అయితే ఈ వార్త‌ల్ని ఖండిస్తూ గిల్ తాజా ఇన్‌స్టా పోస్ట్ లో వాస్త‌వాన్ని రివీల్ చేసారు.

By:  Tupaki Desk   |   30 July 2023 12:30 AM GMT
టైటానిక్ డికాప్రియోతో కాదు ఆయ‌న ఫ్రెండుతో డేటింగ్!
X

బ్రిటీష్ ఇండియ‌న్ మోడల్ నీలం గిల్ టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియోతో డేటింగ్ లో ఉంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం సాగింది. మోడల్ నీలం డికాప్రియో ఇటీవ‌ల‌ సార్డినియా లో కలిసి బోటింగ్ చేస్తున్న‌ ఫోటో లీక‌వ్వ‌డంతో ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు మొద‌లయ్యాయి. అయితే ఈ వార్త‌ల్ని ఖండిస్తూ గిల్ తాజా ఇన్‌స్టా పోస్ట్ లో వాస్త‌వాన్ని రివీల్ చేసారు.

"పుకార్లను క్లియర్ చేయడానికి చెబుతున్నాను.. నేను లియోనార్డో డికాప్రియోకి కొత్త స్నేహితురాలి ని కాను. నిజానికి నేను అత‌డి స్నేహితుడితో అనుబంధాన్ని కలిగి ఉన్నాను. చాలా కాలంగా నేను మేం ప్రేమ‌ లో ఉన్నాం. డికాప్రియోతో క‌లిసి ఉన్న‌ప్ప‌టి ఫోటోనే మీరు చూశారు. కానీ నేను నా భాగస్వామితో కలిసి అక్క‌డ ఉన్నాను" అని తెలిపింది. ఈ వివ‌ర‌ణ‌ అన్ని తప్పుడు ఆలోచ‌న‌ల‌ ను క్లియర్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను అని నీల‌మ్ ముగించింది. అలాగే తాను డికాప్రియో స్నేహితుడితో ప్రేమ‌ లో ఉన్నాన‌ని కూడా ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

ఇదే స‌మ‌యం లో డికాప్రియో స్నేహాల‌ పైనా బోలెడంత చ‌ర్చ సాగుతోంది. డికాప్రియో-న‌టి హడిద్ జోడీ ప్ర‌స్తుతం డేటింగ్ చేస్తున్నారన్న ప్ర‌చారం కూడా ఉంది. వారు ఇటీవ‌లే ఓ చోట రాత్రి వేళ‌ లో క‌లుసుకున్నార‌ని రొమాంటిక్ గా క‌నిపించార‌ని కూడా ప్ర‌చార‌మైంది. అత‌డి సాన్నిహిత్యం లో జిగి హ‌డిద్ ఎంతో సంతోషంగా కనిపించారు అని ఒక సోర్స్ వెల్ల‌డించింది.

అయితే పార్టీల్లో క‌లుసుకున్న‌ప్పుడు ఒక‌రితో ఒక‌రు స‌ర‌సాల్లో మునిగి తేల‌డం చాలా స‌హ‌జ‌మ‌ని ఇది నిజ‌మైన‌ డేటింగ్ కాద‌ ని వ్యాఖ్యానించిన‌వారు ఉన్నారు. ప్ర‌స్తుతం నీల‌మ్ గిల్ క్యాట్ వాక్ ప్రదర్శనలు ఫ్యాషన్ ప్రాజెక్ట్‌లతో మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. 2022లో ఆమె యునిసెఫ్ గాలా కోసం ప్ర‌చారం లో పాల్గొంది. కెరీర్ పై నీలం పూర్తి స్థాయి లో దృష్టి సారిస్తోంది.