Begin typing your search above and press return to search.

రాజమౌళినే మోసం చేసిన నీల్

డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మూవీ సలార్.

By:  Tupaki Desk   |   26 Dec 2023 7:29 AM GMT
రాజమౌళినే మోసం చేసిన నీల్
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మూవీ సలార్. ఈ సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా వీకెండ్స్, క్రిస్మస్ హాలిడే కలిసి రావడంతో సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే 18 ఏళ్ళ లోపు వారిని సినిమా చూడటానికి అనుమతించకపోవడం కొంత మైనస్ అవుతుంది.

ఇదిలా ఉంటే సలార్ మూవీ టీజర్ ని ప్రశాంత్ నీల్ ఆరు నెలల క్రితం రిలీజ్ చేశారు. అందులో టిను ఆనంద్ తో డైనోసార్ డైలాగ్ చెప్పించారు. సింపుల్ ఇంగ్లీష్ అంటూ ప్రభాస్ ని డైనోసార్ తో పోల్చి చెప్పడంతో డైలాగ్ భాగా పేలింది. అప్పటి నుంచి ప్రభాస్ ని డైనోసార్ తో అందరూ కంపారిజన్ చేస్తున్నారు. రాజమౌళి కూడా ఈ టీజర్ చూసిన తర్వాత డైనోసార్ డైలాగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు పోస్ట్ చేశారు. అంతే కాకుండా రాజమౌళి సలార్ టీమ్ తో చేసిన ఇంటర్వ్యూలో కూడా దాని గురించే ఎక్కువ చెప్పాడు. కానీ అప్పుడు దర్శకుడు చప్పుడు చేయలేదు.

ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా సినిమాలో డైనోసార్ డైలాగ్ ఉంటుందని ఎదురుచూశారు. అయితే ఊహించని విధంగా సినిమాలోకి వచ్చేసరికి టీజర్ లో చూపించిన డైలాగ్, టిను ఆనంద్ సీన్ ని ప్రశాంత్ నీల్ ఎక్కడా కూడా ఉపయోగించలేదు. మూవీ చూసిన తర్వాత టీజర్ లో డైలాగ్ లేకపోవడంపై నెటిజన్లు ఆసక్తికరంగా మీమ్స్ క్రియేట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ రాజమౌళిని దారుణంగా మోసం చేశాడంటూ ఢీ సినిమాలోని శ్రీహరి, విష్ణు మధ్య సంభాషణకి మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అలాగే రకరకాల మీమ్స్ కూడా క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన కూడా సినిమాలో డైనోసార్ డైలాగ్ లేకపోవడం ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు.

సలార్ పార్టీ 2 కూడా ఎలాగూ ఉంటుంది కాబట్టి డైనోసార్ డైలాగ్ ని అందులో ఏమైనా పెట్టి ఉంటాడా అనే ఆసక్తి ఇప్పుడు నెలకొంది. మొదటి పార్ట్ లో ప్రశాంత్ నీల్ చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా వదిలేశారు. వాటన్నింటికి పార్ట్ 2లో క్లారిటీ ఇవ్వనున్నాడు. దీంతో ఇప్పుడు సలార్ 2పైన హైప్ క్రియేట్ అయ్యింది.