'సలార్' కోసం నీల్ పారితోషికం?
ప్రభాస్ ఈ సినిమా కోసం 100 కోట్లు పైగా పారితోషికం, అదనంగా లాభాల్లో వాటా అందుకుంటున్నాడని ప్రచారం ఉంది. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం 100 కోట్లు అందుకుంటున్నాడని పుకార్ షికార్ చేస్తోంది.
By: Tupaki Desk | 24 Dec 2023 7:40 AM GMT'సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్' భారీ ఓపెనింగులు సాధించిందని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో 150కోట్ల ఇండియా వైడ్ నెట్ వసూలు చేసిందనేది తాజా సమాచారం. షారూఖ్ డంకీతో పోలిస్తే సలార్ కలెక్షన్ల డామినేషన్ కొనసాగుతోందనేది టాక్. ఈ సినిమాని భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మలిచిన ప్రశాంత్ నీల్ పై మెగాస్టార్ చిరంజీవి సహా ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
ఇంతలోనే ఈ సినిమా కోసం ప్రభాస్- ప్రశాంత్ నీల్ ద్వయం అందుకున్న పారితోషికాల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రభాస్ ఈ సినిమా కోసం 100 కోట్లు పైగా పారితోషికం, అదనంగా లాభాల్లో వాటా అందుకుంటున్నాడని ప్రచారం ఉంది. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం 100 కోట్లు అందుకుంటున్నాడని పుకార్ షికార్ చేస్తోంది.
'సలార్' దర్శకత్వ ప్రతిభ, టెక్నిక్‌పై ఆధారపడిన చిత్రం. అందువల్ల ప్రశాంత్ నీల్ కి ఇంత పెద్ద మొత్తం అందజేయడం తప్పేమీ కాదు! అంటూ ఒక సెక్షన్ సోషల్ మీడియాలో వాదిస్తోంది. రాజమౌళి, ఎస్.శంకర్, అట్లీ కంటే నీల్ ఎక్కువగా అందుకుంటున్నాడా? అంటూ డిబేట్ రన్ అవుతోంది. ఉగ్రం లాంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ (కన్నడ) మూవీతో మెప్పించి, అటుపై కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియాలో సంచలనాలు సృష్టించిన నీల్ 'సలార్'తో మరో మెట్టు పైకి ఎక్కాడు. అతడు వంద కోట్ల పారితోషికం అందుకునే స్థాయి ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఒక కన్నడ దర్శకుడి గురించి ఈ స్థాయిలో చర్చ సాగడం ఇదే మొదటిసారి.