Begin typing your search above and press return to search.

మరోసారి అగ్ర హీరోకు ప్రశాంత్ నీల్ దెబ్బ!

ప్రశాంత్ నీల్ సలార్ తో క్లాష్ వల్లే షారుక్ సినిమాకి గట్టి దెబ్బ పడిందని స్పష్టంగా అర్థమవుతుంది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 6:38 AM GMT
మరోసారి అగ్ర హీరోకు ప్రశాంత్ నీల్ దెబ్బ!
X

బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ గత ఏడాది పఠాన్, జవాన్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ తో భారీ కం బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో కంప్లీట్ డౌన్ ఫాల్ లో ఉన్న షారుక్ 'పఠాన్' తో బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్లు కొల్లగొట్టి తన సత్తా ఏంటో చాటాడు. ఆ తర్వాత వెంటనే జవాన్ తో మరో వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

అలా బ్యాక్ టు బ్యాక్ రెండు ఆల్ టైం బ్లాక్ బస్టర్ డెలివరీ చేసిన షారుక్ తన తదుపరి చిత్రంగా రాజ్ కుమార్ హిరానీతో 'డంకీ' సినిమా చేశాడు. మొదటిసారి వీరి కాంబినేషన్ కలవడంతో ఈ ప్రాజెక్టుపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కానీ రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. డంకీ కథ, కథనం పరంగా బాగానే ఉన్నా అదే సమయంలో వచ్చిన 'సలార్' తో పోటీ పడడం సినిమాకి పెద్ద మైనస్ గా మారింది.

ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సలార్ మూవీతో జరిగిన క్లాష్ వల్ల నార్త్ బెల్టులో 'డంకీ' బిజినెస్ కి భారీగా దెబ్బ పడింది. 'డంకీ' మూవీ ఇండియన్ నెట్ వర్త్ సుమారు 255 కోట్లు ఉన్నప్పటికీ.. సలార్ దాన్ని 150 కోట్లతో డామినేట్ చేసింది. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సలార్ ఫుల్ రన్ లో 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే, డంకీ 475 కోట్లతో సరిపెట్టుకుంది.

ప్రశాంత్ నీల్ సలార్ తో క్లాష్ వల్లే షారుక్ సినిమాకి గట్టి దెబ్బ పడిందని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ సినిమాలు షారుక్ సినిమాకి ఇబ్బందిగా మారడం ఇదే మొదటి సారి కాదు. 2018 లో కూడా 'కేజిఎఫ్ చాప్టర్ 1' షారుక్ ఖాన్ 'జీరో' మూవీతో పోటీ పడగా 'కేజిఎఫ్' హిందీలో ఏకంగా 45 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ అయితే 'జీరో' వరల్డ్ వైడ్ గా 90 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది.

అయితే ఈ విషయంలో షారుక్ ఖాన్ ఫ్యాన్స్ జీరో, డంకి ఈ రెండు సినిమాలు డ్రామా జానర్ కు చెందినవే అని వాదిస్తున్నారు. అదే పఠాన్, జవాన్ లాంటి భారీ స్థాయి యాక్షన్ సినిమాలతో ప్రశాంత్ నీల్ పోటీ పడ్డప్పుడు అసలు అగ్నిపరీక్ష మొదలవుతుందని అప్పుడే ఎవరి క్రేజ్ ఏంటో తెలుస్తుందని అంటున్నారు.