Begin typing your search above and press return to search.

అత‌డి బ‌యోపిక్ లో పాక్తిస్తాన్ విజేత ఆప్ష‌న్ షారుక్ ఖాన్!

ఈ నేప‌థ్యంలో నీర‌జ్ చోప్రా పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తే బాగుంటుంద‌ని అర్ష‌ద్ ని అడ‌గ‌గా అత‌డు షారుక్ ఖాన్ అయితే బాగుంటుంద‌ని తెలిపాడు.

By:  Tupaki Desk   |   18 Aug 2024 11:30 AM GMT
అత‌డి బ‌యోపిక్ లో పాక్తిస్తాన్ విజేత ఆప్ష‌న్ షారుక్ ఖాన్!
X

పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో పాకిస్తాన్ కి అర్ష‌ద్ న‌దీమ్ స్వ‌ర్ణం సాధించ‌గా, భార‌త్ కి చెందిన నీర‌జ్ చోప్రా ర‌జ‌తం కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఇద్ద‌రు హాట్ టాపిక్ అయ్యారు. రెండు శ‌త్రుదేశాల నేప‌థ్యంలో ఒక‌రు స్వ‌ర్ణ వీరులు కాగా, మ‌రొక‌రు ర‌జ‌తం సాధించడంతో? ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది. వీరిద్ద‌రి బ‌యోపిక్ లో ఎవ‌రు న‌టిస్తే బాగుంటుంది అన్న చ‌ర్చ సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో నీర‌జ్ చోప్రా పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తే బాగుంటుంద‌ని అర్ష‌ద్ ని అడ‌గ‌గా అత‌డు షారుక్ ఖాన్ అయితే బాగుంటుంద‌ని తెలిపాడు. 'అత‌డి బ‌యోపిక్ ఎంతో స్పూర్తివంతంగా ఉంటుంది. అందుకు అత‌డు అర్హుడు. ఆ పాత్ర‌లో షారుక్ ఖాన్ అయితే బాగుంటుంది' అని అన్నాడు. మ‌రి అర్ష‌ద్ న‌దీమ్ బ‌యోపిక్ లో ఏ న‌టుడైతే బాగుంటుంద‌ని నీర‌జ్ చోప్రాని అడ‌గ‌గా..

'న‌దీమ్ చాలా ఎత్తుగా ఉంటాడు. అత‌డి పాత్ర చేసే న‌టుడు కూడా అలాగే ఉండాలి. భార‌త్ లో అలాంటి న‌టుడు కేవ‌లం అమితాబ‌చ్చ‌న్ మాత్ర‌మే. ఆయ‌నైతే ఆపాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌రు' అని అన్నారు. ఇలా ఇద్ద‌రు త‌మ బ‌యోపిక్ ల్లో ఎవ‌రు న‌టిస్తే బాగుంటుంది? అన్న విష‌యాన్ని వెల్ల‌డించ‌డం నెట్టింట ఆస‌క్తిక‌రంగా మారింది. టోక్యో ఒలింపిక్స్ లో నీర‌జ్ చోప్రా స్వ‌ర్ణం సాధించిన సంగ‌తి తెలిసిందే.

అప్ప‌టి నుంచి ఈటె వీరుడిగా ప్ర‌పంచ వ్యాప్తంగా నీరజ్ కి మంచి పేరుంది. అత‌డి బ‌యోపిక్ చేస్తే బాగుంటుంద‌ని బాలీవుడ్ మీడియాలో సైతం అప్ప‌ట్లో జోరుగా ప్ర‌చారం సాగింది. తాజాగా ర‌జ‌తం కూడా చేరిన నేప‌థ్యంలో ఆ ఛాన్స్ ఏ ద‌ర్శ‌కుడు తీసుకుంటాడు? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బ‌యోపిక్ ట్రెండ్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే.