నీ వల్లే నీ వల్లే ఈ మాయే నీ వల్లే.. సిద్ శ్రీరామ్ మార్క్..!
మోహన్ శ్రీవత్స డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
By: Tupaki Desk | 8 Feb 2025 2:36 PM GMTకొత్తగా ఏది ప్రయత్నించినా సరే తెలుగు ఆడియన్స్ అలాంటి సినిమాలను భుజాన వేసుకుని సక్సెస్ చేస్తారు. కాన్సెప్ట్ సినిమాలకు ఉన్న డిమాండ్ అది. అందుకే కొత్త కథ ఉంటే చాలు దానికి తగినట్టుగా సినిమా వైబ్ ని క్రియేట్ చేసి దానికి తగిన ప్రమోషన్స్ ని చేస్తున్నారు. యువ దర్సకులు తమకు వచ్చిన ఛాన్స్ ని అన్ని విధాలుగా యూజ్ చేసుకుంటున్నారు. ఇక అలాంటి యువతరం కథతో కొత్త పాయింట్ తో వస్తున్నారు త్రిబాణధారి బార్బరిక్. మోహన్ శ్రీవత్స డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాను వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై విజయపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. వశిష్ట ఎన్ సింహ, సత్యరాజ్, సాంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, ఉదయ భాను ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. త్రిబాణధారి బార్బరిక్ సినిమా మోషన్ పోస్టర్ ఫస్ట్ గ్లింప్స్ తోనే ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా నీవల్లే నీవల్లే అనే సాంగ్ రిలీజ్ చేశారు. రఘురాం లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. సిద్ శ్రీరామ్ పాట పాడితే ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో తెలిసిందే. దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సాంగ్ ఉంది.
సాంగ్ వీడియో కూడా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా మెన్ గా పనిచేస్తుండగా ఇంఫ్యూజన్ బ్యాండ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సినిమా టైటిల్ ఇంకా కాన్సెప్ట్ కొత్తగా ఉండేలా ఉంది కాబట్టి తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఆకట్టుకునే ఛాన్స్ ఉంది.
త్రిబాణధారి బార్బరిక్ టైటిల్ తోనే ఆడియన్స్ అటెన్షన్ రాబట్టిన మేకర్స్ సినిమా ప్రమోషన్స్ సాంగ్స్ తో మరింత బజ్ పెంచాలని చూస్తున్నారు. లేటెస్ట్ గా సినిమా నుంచి రిలీజైన సిద్ సాంగ్ మాత్రం మ్యూజిక్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.