స్టార్ సినిమాలకు పెద్ద ముప్పు.. ఇండస్ట్రీ ఏం చేస్తుంది..?
ఏదైనా స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు సోషల్ మీడియాలో ఒక రకమైన నెగిటివ్ ట్రోల్స్ సిద్ధమవుతాయి.
By: Tupaki Desk | 19 Jan 2025 2:30 AM GMTఏదైనా స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు సోషల్ మీడియాలో ఒక రకమైన నెగిటివ్ ట్రోల్స్ సిద్ధమవుతాయి. స్టార్ హీరో అన్న తర్వాత ఫ్యాన్స్ తో పాటే యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. ఐతే విమర్శ పేరుతో ఈమధ్య సినిమాలను ట్రోల్ చేస్తూ హెల్దీ వాతావరణాన్ని చెడగొడుతున్నారు. మరోపక్క కొందరు సినిమాలకు లీక్ చేస్తూ ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.
సినిమాను చంపేస్తే ఏం వస్తుంది అన్న ఆలోచన లేకుండా ఇలా కొందరు చేస్తున్న పనుల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. స్టార్ హీరో సినిమాల విషయంలో జరుగుతున్న ఈ నెగిటివిటీ ఈమధ్య మరింత ఎక్కువైంది. రీసెంట్ గా రిలీజైన సంక్రాంతి సినిమాల్లో ఒక మూవీని బాగా టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేశారు. ఐతే రీసెంట్ గా దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సినిమాను మనమే చంపుకుంటున్నాం అంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు.
దానికి మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా సపోర్ట్ దక్కింది. ఐతే థమన్ అంత ఓపెన్ గా చెప్పాడు అంటే అతను ఎంత డిస్ట్రబ్ అయ్యాడన్నది అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా విషయంలో టెక్నిషియన్స్ అంతా కూడా ఒకేలా పనిచేస్తారు. కానీ దాన్ని జడ్జి చేసే ఫ్యాన్స్ మాత్రం వేరేలా తీసుకుంటారు. ఇక సంక్రాంతికి రిలీజైన ఒక సినిమా పైరసీ ప్రింట్ ఏకంగా లోకల్ టీవీలో కూడా వేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పరిశ్రమ పెద్దలు ప్రభుత్వంలో మాట్లాడి ఇలాంటి విషయాల మీద కఠిన చర్యలు తీసుకుంటేనే మునుముందు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. లేకపోతే మాత్రం ఇలాంటివి మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంటాయి. అయినా నచ్చిన హీరో సినిమా రిలీజైతే చూసి ఆనందించాలే తప్ప అవతల హీరో సినిమాను నెగిటివ్ చేయాలి.. దాని మీద ట్రోల్ చేయాలి అన్నది నిజమైన అభిమాని చేసే పని కాదు. మరి ఈ ఇష్యూపై ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.
ఇది ఒక సినిమాకు జరిగిన అన్యాయం కాదు పరిశ్రమకు జరుగుతున్న అన్యాయం. ఇలా సినిమాను కిల్ చేసుకుంటూ వెళ్తే రాను రాను మరీ దిగజారే ఛాన్స్ ఉంటుంది. మరి జరుగుతున్న పరిణామాలను సెట్ రైట్ చేసేందుకు పరిశ్రమ నుంచి ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్నది చూడాలి.