Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : జిమ్ ఔట్‌ఫిట్‌ లో శర్మ సిస్టర్స్ అదుర్స్‌

టాలీవుడ్‌ కి దూరం అయినా బాలీవుడ్‌ లో కంటిన్యూ అవుతోంది.

By:  Tupaki Desk   |   25 Sep 2024 7:30 PM GMT
పిక్ టాక్‌ : జిమ్ ఔట్‌ఫిట్‌ లో శర్మ సిస్టర్స్ అదుర్స్‌
X

రామ్‌ చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతో నేహా శర్మ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు నేహా శర్మకి మంచి పేరు వచ్చింది. అయితే లక్ కలిసి రాక పోవడంతో వరుసగా నిరాశ పరుస్తూ ఫెయిల్‌ అయింది. ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. పైగా చిన్న సినిమాలు, ప్రాముఖ్యత లేని పాత్రలను ఎంపిక చేసుకోవడం వల్ల తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ నుంచి ఈ అమ్మడు తప్పుకోవాల్సి వచ్చింది అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. టాలీవుడ్‌ కి దూరం అయినా బాలీవుడ్‌ లో కంటిన్యూ అవుతోంది.


బాలీవుడ్‌ లో అడపా దడపా ఆఫర్లు సొంతం చేసుకుంటూ ఇంకా తాను నటిస్తున్నాను అనే విధంగా సినిమాలు చేస్తున్న నేహా శర్మ సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆమె షేర్‌ చేసిన ప్రతి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల నేహా శర్మ సిస్టర్ ఐషా శర్మ సైతం సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా చూపు తిప్పుకోనివ్వడం లేదు. సాధారణంగా ఇద్దరూ వేరు వేరు ఫోటోలను షేర్‌ చేస్తేనే ప్రేక్షకులు చూపు తిప్పుకోలేరు. అలాంటిది ఇద్దరూ కలిసి కనిపిస్తే ఇంకా ఏమైనా ఉందా.. అన్నట్లుగా తాజా ఫోటో ఉంది.

నేహా సిస్టర్స్ ఫిట్‌ గా ఉండటం కోసం రెగ్యులర్‌ గా జిమ్ కు వెళ్తారు. కేవలం వీరు మాత్రమే కాకుండా హీరోయిన్స్ లో దాదాపు అందరూ ఫిట్నెస్ కోసం రెగ్యులర్‌ గా జిమ్ చేస్తారు. అలా చేయడం వల్లే వారి అందం రోజు రోజుకు మరింత పెరిగిందా అన్నట్లుగా అందంగా కనిపిస్తారు. ఇప్పుడు నేహా శర్మ సైతం మొదటి సినిమాతో పోల్చితే ఇప్పుడే చాలా అందంగా ఉంది అంటూ ఆమె సన్నిహితులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అక్కకు ఏమాత్రం తగ్గకుండా ఐషా శర్మ సైతం చాలా సన్నగా, నాజూకుగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ముందు ముందు హీరోయిన్ గా మంచి ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు సినిమాల్లో అందాల ఆరబోత చేయని ఐషా శర్మ ఇలా అక్కతో కలిసి అప్పుడప్పుడు, సోలోగా అప్పుడప్పుడు ఫోటోలను షేర్‌ చేసి నెటిజన్స్ చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ ఇద్దరు ముద్దుగుమ్మల సొంతం అవ్వడంతో ముందు ముందు మళ్లీ వీరిద్దరు సినిమాల్లో బిజీ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జిమ్‌ డ్రెస్ లో వీరిద్దరినీ చూస్తూ ఉంటే మతి పోతుందని, ఒకేసారి ఇద్దరి అందం చూడ్డానికి రెండు కళ్లు చాలడం లేదు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి ఈ సిస్టర్స్ వైరల్ అవుతున్నారు.