శ్రీలంక తీరంలో బికినీ బ్యూటీ వేషాలు
ఇటీవల సమ్మర్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. దీంతో సెలబ్రిటీలంతా మాల్దీవుల ప్రయాణంలో ఉన్నారు.
By: Tupaki Desk | 29 March 2025 3:49 AMఇటీవల సమ్మర్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. దీంతో సెలబ్రిటీలంతా మాల్దీవుల ప్రయాణంలో ఉన్నారు. గోవా టూరిజం అంతకంతకు దిగజారుతోందని నివేదికలు ఉన్నా .. లక్ష్యద్వీప్ టూరిజాన్ని డెవలప్ చేయాలని ప్రభుత్వం పూనుకున్నా.. మాల్దీవులకు డిమాండ్ తగ్గలేదు. ఒంటరి దీవుల్లో చిల్ అయ్యేందుకు తారలు ఆసక్తిగా ఉన్నారు.
అయితే ఇతరులకు భిన్నంగా నేహా శర్మ ఇటీవల శ్రీలంక తీరంలో తళుక్కున మెరిపించింది. బ్లాక్ మోనోకినిలో హృదయాలను కొల్లగొట్టింది. బీచ్ లో అందమైన భంగిమలతో నేహా శర్మ చెలరేగిపోయింది. నేహా ఫిట్‌నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. జిమ్‌లు స్టూడియోల వెలుపల ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా జిమ్ లో కసరత్తులు చేసాకే ఇలా బీచ్ లో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఈ ఫోటోలను యువతరం వైరల్ గా షేర్ చేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. నేహా చివరిగా విజయ్ దేవరకొండ `ఫ్యామిలీ స్టార్`లో అతిధి పాత్రలో కనిపించింది. కానీ ఈ సినిమా ఫ్లాపైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ బాలీవుడ్ లో కొన్ని పెద్ద సినిమాల్లో నటించినా కానీ నేహా శర్మ ఫేట్ మారలేదు. కాంపిటీషన్ లో ఈ భామ వెనకబడింది. నేటితరం చిల్లింగ్ గాళ్స్ రేసులో దూసుకుపోతున్నా, నేహా కేవలం మోడలింగ్ అసైన్ మెంట్స్ ఇన్ స్టా పోస్టులకు పరిమితమైంది. హేరాఫేరి 3 లో నటిస్తోందని కబురందినా కానీ ఈ సినిమా తాజా అప్ డేట్ అందలేదు.