జపనీస్ రెస్టారెంట్ ప్రారంభించిన నేహాశర్మ
నేహా శర్మ పరిచయం అవసరం లేదు. చిరుత సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇటీవల బాలీవుడ్ సినిమాలతోను మెప్పించింది.
By: Tupaki Desk | 22 Sep 2024 1:30 AM GMTనేహా శర్మ పరిచయం అవసరం లేదు. చిరుత సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇటీవల బాలీవుడ్ సినిమాలతోను మెప్పించింది. కొత్త వెంచర్ `కాల్ మీ టెన్`తో వ్యవస్థాపక ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. ఈ వినూత్నమైన ఇజకయా జపనీస్ రెస్టారెంట్.. ఓమకాస్ బార్ వంటివి ప్రారంభించింది. మారుతున్న అభిరుచికి తగ్గట్టుగా నేహా శర్మ తెలివైన పెట్టుబడులను పెడుతోంది.
నేహా ఈ కొత్త అధ్యాయం గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, ``నేను ఎప్పుడూ ఆహారంపై మక్కువ కలిగి ఉన్నాను. `కాల్ మీ టెన్` ప్రారంభించడంతో ఒక కల నిజమైంది. ఇది ప్రేమతో కూడిన ఆహారపదార్థాలను అందిస్తుంది. శ్రమ, రుచికరమైన ఆహారం, గొప్ప కంపెనీ ప్రామాణికమైన జపనీస్ ఆతిథ్యాన్ని ఆస్వాధించడానికి ప్రజలకు కలిసివచ్చే స్థలం. ఈ అనుభవాన్ని అందరితో పంచుకోవడానికి నేను వేచి ఉండలేను`` అని అన్నారు. సమకాలీన నేపధ్యంలో జపనీస్ వంటకాల అద్భుత రుచులను అందిస్తూ.. అసాధారణమైన భోజన అనుభవాన్ని అందించడానికి రెస్టారెంట్ సిద్ధంగా ఉంటుంది. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉన్న కాల్ మీ టెన్ సెప్టెంబర్ 22న అధికారికంగా ప్రారంభమైంది.
సహ వ్యవస్థాపకులు కరణ్ ఆర్ చావ్లా, అంగద్ సింగ్ , అక్షయ్ షోకీన్ ఆతిథ్య పరిశ్రమ నుండి వారి సామూహిక నైపుణ్యాన్ని తీసుకువచ్చి ఈ ఎగ్జయిట్ చేసే వెంచర్‌లో నేహాతో చేరారు. వారు రెస్టారెంట్ పర్పస్ గురించి స్పష్టంగా తెలియజేసారు. కాల్ మి టెన్ అనేది ఆతిథ్య పరిశ్రమలో మా ప్రయాణం పరాకాష్టను సూచిస్తుంది. ఇది ఢిల్లీలో ఆధునిక జపనీస్ డైనింగ్‌ను పునర్నిర్వచించాలనే దృష్టితో నడిచింది అని వెల్లడించారు.