పవర్ స్టార్ అభిమానుల కోసం 'అక్క'నే దించారే!
తాజాగా సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట వచ్చేసింది.
By: Tupaki Desk | 18 Dec 2024 5:38 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పక్కాగా డేట్లు కేటాయించడంతో ఏమాత్రం సమయం వృద్ధా చేయకుండా మేకర్స్ చకచకా పూర్తి చేసే పనిలో పడ్డారు. తాజాగా సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట వచ్చేసింది. ప్రస్తుతం థాయ్ లాండ్ లో షూటింగ్ జరుగుతుంది. దీనిలో భాగంగా అక్కడ పాటల చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది.
మొత్తం మూడు పాటలు థాయ్ అందాల్లో షూట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఓ ఎలివేషన్ సాంగ్, అలాగే ప్రియాంక మోహన్-పవన్ పై ఓ డ్యూయెట్ సాంగ్ చేస్తున్నారు. మరి కుర్రాళ్లను హీటెక్కించే ఐటం నెంబర్ సంగతేంటి? అంటే? సుజిత్ అదిరిపోయే స్పెషల్ సాంగ్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకోసం హాట్ బ్యూటీ నేహాశెట్టి అలియాస్ రాధిక అక్కనే రంగంలోకి దించుతున్నాడు. ముందుగా థాయ్ లాండ్ లో ఐటం పాటే చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా థాయ్ లాండ్ షెడ్యూల్ పాటతో ముగిస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమాలోకి నేహా శెట్టి ఎంట్రీ అదనంగా కలిసొస్తుంది. అమ్మడికి యూత్ లో మంచి ఫాలోయింది ఉంది. `డీజే టిల్లు`తో రాధిక అక్కగా ఓ ఊపు ఊపేసింది. అలాంటి భామతో పవన్ ఐటం నెంబర్ అంటే? అభిమానుల ఆనందానికి అవధు లుండవ్. ఇంతవరకూ నేహా శెట్టి ఐటం నెబర్లలో నర్తించలేదు. తొలిసారి పవన్ సినిమాలో అవకాశం రావడంతో కాదనకుండా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఐటం నంబర్ నేహా కెరీర్ ని కూడా టర్న్ చేసే గొప్ప అవకాశం అని చెప్పాలి.
`గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` తర్వాత అమ్మడు ఇంత వరకూ కొత్త సినిమాకి సైన్ చేయలేదు. ఇండస్ట్రీలో కొత్త భామల నుంచి పోటీ ఎదుర్కుటుంది. ఈ క్రమంలో పీకే సినిమాలో ఐటం సాంగ్ అమ్మడికి మంచి బూస్టింగ్ లాంటింది. దర్శఖ, నిర్మాతల కళ్లు మళ్లీ రాధికపై పడే ఛాన్స్ లేకపోలేదు. గ్లామర్ పాత్రలతో ఇప్పటికే తనదమైన ముద్ర వేసింది. అలాంటి హాటీతో ఐటం పాట అంటే మామూలుగా ఉంటుందా. థియేటర్లో రచ్చ రచ్చే.