నాకు చివరి ఆఫర్ ఎప్పుడొచ్చిందో గుర్తు లేదు: నేహా ధూపియా
చివరిసారిగా హిందీ సినిమా ఆఫర్ ఎప్పుడు వచ్చిందో నాకు గుర్తులేదు అని కూడా అంది.
By: Tupaki Desk | 22 July 2024 11:04 AM GMTనేహా ధూపియా పరిచయం అవసరం లేదు. జూలీ సినిమాలో డ్యాషింగ్ బోల్డ్ పెర్ఫామెన్సెస్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, సౌత్ సినిమాల్లోను నటించింది. నందమూరి బాలకృష్ణ `పరమవీరచక్ర` చిత్రంలోను నేహా ధూపియా యాక్షన్ పాత్రలో అద్భుతంగా నటించింది. అయితే నేహా ఆఫర్ట్ మ్యారేజ్ పరిమితంగానే పెద్ద తెరపై కనిపిస్తోంది. ఓవైపు బుల్లితెర అవకాశాలు అందుకుంటున్నా కానీ, తాను ఇంకా అవకాశాల కోసం కష్టపడుతున్నానని చెప్పింది. చివరిసారిగా హిందీ సినిమా ఆఫర్ ఎప్పుడు వచ్చిందో నాకు గుర్తులేదు అని కూడా అంది.
నేహా ధూపియా తాజా ఇంటర్వ్యూలో సౌత్ నుండి తనకు ఆఫర్లు వస్తున్నాయని, అయితే తనకు హిందీ సినిమా ఆఫర్ చివరిసారిగా ఎప్పుడు వచ్చిందో గుర్తుకు రాలేదని వెల్లడించింది. ఇటీవలి ప్రాజెక్ట్‌లలో లెక్క తేడా వచ్చిందని కూడా అంది. 21 సంవత్సరాల క్రితం `ఖయామత్: సిటీ అండర్ థ్రెట్`(2003)తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నేహా ధూపియా, ఆసక్తికరమైన చిత్రాల్లో అద్భుత నటప్రదర్శనలతో ఆకట్టుకుంది. గత 22 సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నానని ఇటీవల వెల్లడించింది. ప్రాజెక్ట్ లెక్కల్ని మార్చలేని నటిగానే ఉన్నానని నేహా అంది. హిందీ అవకాశాలు తగ్గాయని తెలిపింది. తాజా ఇంటర్వ్యూలో నేహా ధూపియా నటిగా తన కష్టాల గురించి ఓపెనైంది. 22 సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నాను. నా సినిమాలు కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద బాగా రాణించాయి. కొన్నిసార్లు తక్కువ ఆదరణ పొందాయి. మిథ్యా, ఏక్ చాలీస్ కి లాస్ట్ లోకల్, ఫాస్ గయే రే ఒబామా లేదా ఏక్ గురువార్ వంటి చిత్రాలు OTT లో విడుదలయ్యాక వాటిలో నా ప్రదర్శన నచ్చిన వారు నా వద్దకు వచ్చి మాతో ఎందుకు కలిసి పని చేయకూడదు అని అడుగుతున్నారు.. అని తెలిపింది.
మహమ్మారి సమయంలో.. అలాగే ప్రసవానంతర సమయంలో బాడ్ న్యూజ్ మూవీలో నటించాల్సిందిగా ఫోన్ వచ్చిందని నేహా తెలిపింది. ఆ సమయంలో నా ఫోన్ మోగినందుకు సంతోషించాను.. కానీ నా ఫోన్ అంతగా నిరంతరం రింగ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు మీరు నాకు చివరిసారిగా సినిమా ఆఫర్ ఎప్పుడు వచ్చింది? అని అడిగితే చెప్పలేను. నాకు దక్షిణాది నుండి సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పగలను. నేను దక్షిణాదిన కూడా పని చేయడానికి ఇష్టపడతాను. అక్కడ గత మూడు నెలల్లో బ్యాక్ టు బ్యాక్ రెండు ఆఫర్లు వచ్చాయి అని తెలిపింది.
నాకు చివరిసారిగా హిందీ సినిమా ఆఫర్ ఎప్పుడు వచ్చిందో గుర్తు లేదు. నా ఫోన్ ఎందుకు తరచుగా రింగ్ కాలేదో నాకు తెలియదు. పరిశ్రమ చాలా కష్టకాలంలో ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను తలుపు తట్టడానికి వెళ్లినా ప్రయోజనం లేదు. బయటకు వెళ్లి పని కోసం అడగడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. పని కల్పించే వారే లెక్కలు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. స్క్రిప్ట్ కాకుండా సినిమాలు తీయడానికి డబ్బు కావాలి. పెద్ద స్క్రిప్ట్- డబ్బు- ఎక్సెల్ షీట్ ఇవన్నీ కావాలి. అయినా గణితం పని చేయడం లేదు. కాబట్టి మనం అసలు ఎవరి వద్దకు వెళ్లగలం? అని కూడా సందేహం వ్యక్తం చేసారు.
నేహా ధూపియా 120 మంది నటీనటులతో తన పేరును చేర్చి జాబితాను తయారు చేసానని తెలిపింది. వారంతా ఎ-లిస్టర్‌లు కానందున సినిమా లెక్కల్ని మార్చగల స్థానంలో లేరని అభిప్రాయపడ్డారు. మేము ప్రాజెక్ట్ గణితాన్ని మార్చే నటులం కాదు. ఎందుకంటే మేం పెద్ద టిక్కెట్టు నటులం కాదు. మేము అక్కడకు వెళ్లి పని చేయాలనుకునే వాళ్లం. వృత్తిపరమైన రుసుము వసూలు చేయాలి. వృత్తిపరమైన రుసుము అనేది మీ స్వంత మార్కెట్ ధరలను నిర్ణయించేదాని కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మేం బ్యాలెన్స్ షీట్‌ను అంతగా షేక్ చేయలేము అని నేహాధూపియా అన్నారు.