Begin typing your search above and press return to search.

అందాల 'చిరుత' ఇంకా చంపేస్తూనే ఉంది!

తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందంతో కన్నుల విందు చేసింది. చూపు తిప్పుకోనివ్వకుండా అందంగా ఈ అమ్మడు తాజా ఫోటో షూట్‌ తో ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 9:19 AM GMT
అందాల చిరుత ఇంకా చంపేస్తూనే ఉంది!
X

మెగా హీరో రామ్‌ చరణ్ మొదటి సినిమా చిరుత వచ్చి 15 ఏళ్లు దాటిన విషయం తెల్సిందే. ఆ సినిమా తోనే హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. ఆ సినిమాలో సంజన పాత్రకు ప్రాణం పోసింది అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే చిరుత విజయాన్ని ఆమె సద్వినియోగం చేసుకోవడం లో విఫలం అయ్యింది.


చిరుత సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎంత అందంగా ఉందో ఇప్పటికి కూడా అదే అందం తో నేహా శర్మ సోషల్‌ మీడియాలో కన్నుల విందు చేస్తూ ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందంతో కన్నుల విందు చేసింది. చూపు తిప్పుకోనివ్వకుండా అందంగా ఈ అమ్మడు తాజా ఫోటో షూట్‌ తో ఆకట్టుకుంది. ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 15 ఏళ్లు దాటినా కూడా నేహా శర్మ తన అందంతో ఇంకా చంపేస్తూనే ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


సాధారణంగానే నేహా శర్మ చాలా అందంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాంటిది వైట్ డ్రెస్ లో అది కాకుండా ఇలా అందాల ఆరబోత చేస్తూ మరింత అందంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంను సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్ సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యారు అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


ప్రస్తుతం బాలీవుడ్‌ లో సినిమాలు మరియు సిరీస్ లతో మెల్లగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేహా శర్మ అతి త్వరలోనే సౌత్ లో కూడా సినిమా లేదా సిరీస్ ద్వారా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.