చిరుత బ్యూటీ స్టన్నింగ్ దీవాళి లుక్ చూసారా?
గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతోందని ప్రచారమైంది.
By: Tupaki Desk | 31 Oct 2024 4:36 PM GMT'చిరుత' సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన నేహాశర్మ ఆ తరవాత సౌత్ లో కనిపించలేదు. కేవలం హిందీ చిత్రాల్లో నటించింది. ఇటీవల శర్మాగాళ్ కెరీర్ ఇటీవల అంతంత మాత్రమే. గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతోందని ప్రచారమైంది. తన తండ్రి, కాంగ్రెస్ నాయకుడు దీనిని ధృవీకరించినా నేహాశర్మ కేవలం పార్టీ ప్రచారానికే పరిమితమైంది.
అదంతా గతం అనుకుంటే, ఈరోజు దీపావళి సందర్భంగా నేహా శర్మ కొత్త లుక్ లో కనిపించింది. పూర్తిగా రెడ్ కలర్ డిజైనర్ దుస్తుల్లో నేహా శర్మ ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించింది. రెడ్ లో నేహా ఎంతో అందంగా ఒద్దికగా కనిపించింది. ఎరుపు రంగు మఖమల్ డిజైనర్ గౌనులో నేహాశర్మ స్టన్నింగ్ అప్పియరెన్స్ తో మైమరిపించిందనే చెప్పాలి.
ప్రస్తుతం శర్మా గాళ్ స్టిల్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. నేహా ఫుల్ కిక్కిస్తోందంటూ ఫ్యాన్స్ దీనిపై కామెంట్లు చేస్తున్నారు. చిరుత సీక్వెల్ చేస్తే తిరిగి టాలీవుడ్ కి వస్తుందా? అంటూ చరణ్ అభిమానులు వెర్రిగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి నేహా శర్మ హిందీ పరిశ్రమలో ఓటీటీ ఆఫర్లకు ప్రాధాన్యతనిస్తోందని తెలిసింది.