Begin typing your search above and press return to search.

శ‌ర్మా సిస్ట‌ర్స్ సంథింగ్ స్పెష‌ల్

శ‌ర్మా సిస్ట‌ర్స్ ఎప్పుడు ఎక్క‌డ ఉన్నా అక్క‌డ వెలుగు జిలుగుల‌కు కొదవేమీ ఉండ‌దు.

By:  Tupaki Desk   |   7 July 2024 11:30 PM GMT
శ‌ర్మా సిస్ట‌ర్స్ సంథింగ్ స్పెష‌ల్
X

శ‌ర్మా సిస్ట‌ర్స్ ఎప్పుడు ఎక్క‌డ ఉన్నా అక్క‌డ వెలుగు జిలుగుల‌కు కొదవేమీ ఉండ‌దు. నేహా శర్మ -ఐషా శర్మ ఫ్యాషన్ గోల్స్ ని సెట్ చేయ‌డంలో ఎప్పుడూ విఫలం కారు. శుక్రవారం సాయంత్రం ముంబైలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహ సంగీత్ వేడుక‌కు శ‌ర్మా సిస్ట‌ర్స్ కొత్త క‌ళ‌ను తెచ్చారు. ఎంతో స్టైలిష్ గా ఈవెంట్లోకి దూసుకొచ్చిన బాలీవుడ్ సిస్ట‌ర్స్ మరోసారి హెడ్ ట‌ర్న‌ర్స్‌గా మారారు. రెడ్ కార్పెట్‌పై కెమెరాల‌కు పోజులిచ్చిన తోబుట్టువులిద్దరూ వెరీ స్పెష‌ల్ గా క‌నిపించారు.

నేహా నల్లటి బ్రాలెట్, రచ్డ్ స్కర్ట్ & ప్రింటెడ్ ష్రగ్‌తో హెడ్ ట‌ర్న‌ర్‌గా మార‌గా.. ఐషా శ‌ర్మ‌ మరోవైపు ఈవెంట్ కోసం పీచు-రంగు సంప్రదాయ లెహంగా కాంబినేష‌న్ చోళీని ధరించింది. నేహా శర్మ- ఐషా సోషల్ మీడియాల‌లో నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్‌లో ఉన్నారు. వారి అందమైన ఫోటో షూట్‌లు.. హాట్ పబ్లిక్ అప్పియరెన్స్‌లతో నిరంత‌రం ఫ్యాన్స్ ని చిల్ చేస్తున్నారు. జిమ్‌లకు వెళుతూ ఫిట్నెస్ గోల్స్ సెట్ చేయ‌డంలోనే కాదు.. విమానాశ్రయాలలో నిరంత‌రం క‌నిపిస్తూ ఎల్లప్పుడూ ఫోటోగ్రాఫర్‌ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సిస్ట‌ర్స్ ఫోటోషూట్లు ఆన్‌లైన్‌లో తక్షణమే వైరల్ అవుతున్నాయి.

తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ నేహా శ‌ర్మ‌.. కొన్నిసార్లు డి-గ్లామ్ పాత్రలను ఎలా పోషించవలసి వస్తుందో వెల్ల‌డించారు. తెరపైనా తెర‌ వెలుపలా ఆమె ఆకర్షణీయమైన పాత్ర‌ల‌తో మెప్పించిన‌ నేహా కూడా కొన్నిసార్లు త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను విస్మరించడం గురించి త‌న‌ ఇమేజ్‌కి వ్యతిరేకంగా ఉండే అవ‌కాశాలు వ‌చ్చినా తిర‌స్క‌రించ‌డం వంటివి చేసాన‌ని తెలిపింది. పరిశ్రమలో ప్ర‌తిదీ సీరియస్‌గా తీసుకోవాలంటే, మిమ్మల్ని మీరు డి-గ్లామ్ చేసుకోవాలి. మీరు ఒక నిర్దిష్ట మార్గంలో వెళితే.. వారు మిమ్మల్ని చెత్త‌ నటులు అంటారు. ఇది కేవలం మూస ఆలోచ‌న‌ మాత్రమేనని నేను భావిస్తున్నాను అని కూడా వ్యాఖ్యానించింది.

తాను చాలా అందంగా కనిపించడం కోసం చాలా కోల్పోయాన‌ని కూడా నేహా శ‌ర్మ అంది. అందంగా ఉన్నావ‌ని చెప్పి అవ‌కాశాలు ఇవ్వ‌ని నిర్మాత‌లు ఇక్క‌డ ఉన్నారు. అయితే ఒక నిర్మాత మేము వెతికే అమ్మాయి నువ్వు కాదు! అని చెప్పి కూడా త‌ర్వాత త‌న‌ను ఎంపిక చేసుకున్నాడ‌ని కూడా నేహా శ‌ర్మ గుర్తు చేసుకున్నారు.