Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బ్లాక్ డ్రెస్ లో చిరుత బ్యూటీ అదరహో

ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో నేహా శర్మ రెగ్యులర్‌ గా సందడి చేస్తూ అందాల ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా నార్త్‌ మరియు సౌత్‌ లో కూడా ఈ అమ్మడి గురించి చర్చ జరుగుతోంది అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 7:45 AM GMT
పిక్ టాక్ : బ్లాక్ డ్రెస్ లో చిరుత బ్యూటీ అదరహో
X

రామ్‌ చరణ్ తో కలిసి చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి సినిమాతో, హిట్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ హిట్ ను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయింది. తప్పుడు ఎంపికల కారణంగా సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు రాలేదు.


ఆ తర్వాత కాస్త తెలివిగా అడుగులు వేయడం ద్వారా బాలీవుడ్‌ లో ఇప్పటికి కూడా సందడి చేస్తోంది. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో నేహా శర్మ రెగ్యులర్‌ గా సందడి చేస్తూ అందాల ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా నార్త్‌ మరియు సౌత్‌ లో కూడా ఈ అమ్మడి గురించి చర్చ జరుగుతోంది అనడంలో సందేహం లేదు.


తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందమైన ఫోటోలతో సర్‌ ప్రైజ్ చేసింది. గోవా లో ఉన్న ఈ అమ్మడు అక్కడి అందాలను తన ఫాలోవర్స్ కి చూపించడం తో పాటు తన అందమైన ఫోటోలను కూడా షేర్‌ చేయడం ద్వారా సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా వావ్‌ అదుర్స్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

బ్లాక్ డ్రెస్‌ లో క్లోజప్‌ షాట్‌ లో నేహా శర్మ తన అందాన్ని చూపిస్తూ చూపి తిప్పుకోనివ్వకుండా, ఫ్యాన్స్ తో పాటు కుర్రకారు అందరికి కూడా పిచ్చెక్కిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరీ ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే మేము ఎలా తట్టుకోవాలి అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తే, మరి కొందరు ఇంత అందంగా ఉన్నా కూడా ఆ స్థాయిలో ఆఫర్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.