Begin typing your search above and press return to search.

వీడియో: గ‌డ్డ క‌ట్టించే నీటి ట‌బ్‌లో చిరుత గాళ్

ఈ ఫోటోగ్రాఫ్స్ లో స్విమ్‌సూట్ ధ‌రించిన నేహా హాయిగా బాత్ ట‌బ్‌లో మున‌క‌లు వేస్తూ అద్భుతంగా కనిపించింది.

By:  Tupaki Desk   |   31 May 2024 4:44 PM GMT
వీడియో: గ‌డ్డ క‌ట్టించే నీటి ట‌బ్‌లో చిరుత గాళ్
X

చిరుత గాళ్ నేహాశ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ భామ నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. నేహా షేర్ చేసిన‌ తాజా సోషల్ మీడియా పోస్ట్ హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో స్విమ్‌సూట్ ధ‌రించిన నేహా హాయిగా బాత్ ట‌బ్‌లో మున‌క‌లు వేస్తూ అద్భుతంగా కనిపించింది.

ఈ పోస్ట్‌కి ఆస‌క్తిక‌ర‌మైన‌ క్యాప్షన్ ఇచ్చింది, ''ఇది అద్భుతంగా అనిపించింది... పుష్ చేసినందుకు ధన్యవాదాలు'' అని వ్యాఖ్యానించింది. నేహా ఈ బికినీ బాత్ సెష‌న్ కి సంబంధించిన‌ వీడియోలో అద్భుతంగా కనిపించింది. స్నేహితులు ఈ వీడియోని షూట్ చేస్తుంటే స్నేహా ఎంతో చిల్లింగ్ గా క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ హాట్ వీడియో వైర‌ల్ గా మారింది. నవంబర్ 21 నేహా బ‌ర్త్ డే. ఇప్పుడు నేహాకు 36 ఏళ్లు. తన సోదరి కం నటి ఐషా శర్మతో కలిసి దుబాయ్ ఆకాశ హార్మ్యాల్లో పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న వీడియోల‌ను షేర్ చేసింది.

నేహా శర్మ క్రూక్, తుమ్ బిన్, యమ్లా పగ్లా దీవానా 2, యంగిస్తాన్, క్యా సూపర్ కూల్ హై హమ్, తాన్హాజీ వంటి విజ‌య‌వంత‌మైన‌ చిత్రాలలో నటించింది. చివరిగా జోగిర సారా రాలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి నటించింది. ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా, మహాక్షయ్ చక్రవర్తి కూడా కీలక పాత్రలు పోషించారు. నేహా చెల్లెలు ఐషా శర్మ కూడా నటిగా కొన‌సాగుతోంది.