Begin typing your search above and press return to search.

చిరుత బ్యూటీ కూడా స్టార్ట్ చేసేసిందిగా!

టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీల సెలబ్రిటీలకు రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతోంది

By:  Tupaki Desk   |   15 May 2024 12:20 PM GMT
చిరుత బ్యూటీ కూడా స్టార్ట్ చేసేసిందిగా!
X

టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీల సెలబ్రిటీలకు రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతోంది. దానికి ముఖ్య కారణం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటమే. చాలామంది సెలబ్రిటీలు ఫ్యామిలీ మ్యాటర్స్ తో పాటు పర్సనల్ విషయాలను డైలీ పంచుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లారు? ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఏం చేస్తారు? అనే విషయాలను షేర్ చేసుకుంటున్నారు. తమ మూవీ అప్డేట్స్ కూడా షేర్ చేస్తున్నారు. అలా ఫ్యాన్స్ కు చాలా దగ్గరవుతున్నారు.

ముఖ్యంగా హీరోయిన్లు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఏదైనా బ్రాండ్ ను వారు ప్రమోట్ చేశారంటే ఆయా కంపెనీలకు ఆదాయం పెరుగుతోంది. అంతేకాదు.. షేర్ చేసే హీరోయిన్లకు కూడా మంచి ఆదాయం వస్తోంది. కొన్నిసార్లు సినిమాలు కన్నా.. యాడ్స్, ప్రమోషన్స్ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు. సినిమా అవకాశాలు తగ్గినా.. సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమ్ దక్కించుకుంటూ చేతి నిండా ఆర్జిస్తున్నారు.

కొందరు హీరోయిన్లు అయితే రీసెంట్ గా కొన్ని విషయాల్లో టిప్స్ కూడా ఇస్తున్నారు. అలా రకరకాల యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి హీరోయిన్ నేహా శర్మ కూడా చేరింది. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ చిరుత సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న నేహా.. సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటోంది.

ఎప్పటికప్పుడు తన కొత్త పిక్స్, వీడియోస్ షేర్ చేస్తుంటోంది. తన సోదరితో కలిసి జిమ్‌, ఈవెంట్స్‌ కు వెళుతూ పోజులు ఇస్తుంటోంది. ట్రావెల్ కంటెంట్ తో ఫుల్ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇన్‌ స్టాగ్రామ్‌ లో 21 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. తాజాగా స్కిన్ కేర్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తోంది. ఓ కాస్మోటిక్ కంపెనీ ఫేస్ మాస్క్ ను ప్రమోట్ చేసింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో ను షేర్ చేసింది నేహా.

వీడియోలో గ్లామరస్ గా కనిపించి.. తన ఎద అందాలతో నెటిజన్లు ఆకట్టుకుంది. మొత్తానికి సినిమాలకు దూరంగా ఉన్నా.. నేహ కూడా మిగతా హీరోయిన్స్ లాగా ప్రమోషన్స్ తో బాగా సంపాదిస్తుందన్నమాట. ఇటీవల ఈ బ్యూటీ.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె తండ్రి అజిత్ శర్మ మాత్రమే బరిలో నిలిచారు. ఆయన తరఫున రంగంలోకి దిగి ప్రచారం చేసింది నేహా శర్మ. మరి ఆమె గ్లామర్ ఎంతవరకు వర్కౌట్ అయిందో వేచి చూడాలి.