ఫోటో స్టోరి: శర్మా గాళ్ ఘాటు ఫోజు వైరల్
తాజాగా ఇదే బీచ్ వెకేషన్ ఫోటో సిరీస్ నుంచి మరికొన్ని అందమైన ఫోటోలను నేహా షేర్ చేయగా అవి యువతరంలో అగ్గి రాజేస్తున్నాయి.
By: Tupaki Desk | 5 Feb 2024 4:28 AM GMT'చిరుత' బ్యూటీ నేహా శర్మ సినిమాలతో కాకుండా ఇతర మార్గాల్లో యువతరాన్ని ఆకర్షించడంలో ప్రసిద్ధి. ఈ వారంతం నేహా శర్మ వీకెండ్ మూడ్‌లో ఉంది. ఇంతకుముందే ఒక పుస్తకం చదువుతూ బీచ్ వెకేషన్ లో కనిపించింది. అక్కడ రిలాక్స్డ్ గా లాంజ్‌వేర్ లో మతులు చెడగొట్టే రూపంతో ప్రత్యక్షమైంది. "చివరిసారిగా ఒక పుస్తకం చదివితే ఇంత సంతోషాన్ని కలిగిస్తుందా?" అని ఆ ఫోటోకి అందమైన క్యాప్షన్ ఇచ్చింది.
తాజాగా ఇదే బీచ్ వెకేషన్ ఫోటో సిరీస్ నుంచి మరికొన్ని అందమైన ఫోటోలను నేహా షేర్ చేయగా అవి యువతరంలో అగ్గి రాజేస్తున్నాయి. నేహా ఒక లేత గోధుమరంగు క్రోచెట్ దుస్తులు ధరించి కనిపించింది. ఒక భారీ తెల్లటి చొక్కా ను మెస్సీ ఇన్నర్ పై ధరించింది. స్ట్రా సన్ కౌబాయ్ టోపీని కూడా అందంగా ధరించి కనిపించింది.
వీటన్నిటినీ మించి నేహా రెడ్ ఇన్నర్ ధరించి బటన్ లెస్ ఫోజులతో టీజ్ చేసింది. అలాగే రాతితో డిజైన్ చేసిన స్టడ్‌లు, స్టేట్‌మెంట్ రింగ్ లను యాక్సెసరైజ్ చేసింది. ఫ్రీ-ఫ్లో స్లీవ్‌లు ప్లంకింగ్ V-నెక్‌లైన్‌తో కూడిన ఆఫ్-వైట్ క్రాప్డ్ బ్లౌజ్ లో నేహా ఎంతో స్పెషల్ గా కనిపించింది. నేహా ధరించిన లాకెట్టు బ్రాస్‌లెట్ .. బ్రౌన్ లిప్ టింట్‌తో కూడిన రోజీ గ్లామ్ మేకప్ ప్రతిదీ ఆకర్షణను పెంచాయి.
గత సంవత్సరం తన 36వ పుట్టినరోజు సందర్భంగా, నేహా శర్మ తన స్పెషల్ డేని దుబాయ్ సముద్రతీరంలో జరుపుకుంది. అప్పుడు తనతో పాటే తన సోదరి ఐషా శర్మ కూడా ఉంది. ఈ అక్కా చెల్లెళ్ల అనుబంధం ఎల్లపుడూ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే నేహా శర్మకు తానాజీ తర్వాత మళ్లీ అంత పెద్ద హిట్టు పడలేదు. అడపాదడపా సినిమాలు చేస్తున్నా కానీ వాటి వల్ల ఆశించినంత పేరు రాలేదు.