Begin typing your search above and press return to search.

ఈ డీజే పిల్ల హవా మామూలుగా లేదు

ఈ పాటల్లో ఆమె లుక్స్​.. హీటెక్కించేస్తున్నాయి. సోషల్​మీడియాలో అంతా ఈమెదే డామినేషన్ కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 12:35 PM GMT
ఈ డీజే పిల్ల హవా మామూలుగా లేదు
X

'డీజే టిల్లు' సినిమాతో 'రాధిక'గా యూత్​లో ఫుల్ క్రేజ్ అండ్ పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ నేహా శెట్టి. తన బోల్డ్​ అండ్​ హాట్​ నెగటివ్​ టచ్​ పెర్ఫామెన్స్​తో.. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ కుర్రాళ్లను ఫిదా చేసేసింది. ఒక్కసారిగా స్టార్ స్టేటస్​ను అందుకుంది. దీంతో సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన అంతా ఈ ముద్దుగమ్మ హవే నడిచింది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మరోసారి టాక్​ ఆఫ్​ ది ఇండస్ట్రీగా మారింది.


వివరాళ్లోకి వెళితే.. డీజే టిల్లు సినిమా సక్సెస్​తో ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటోంది. అయితే డీజే టిల్లు తర్వాత ఇంకా ఒక్క సినిమాతో కూడా స్క్రీన్​పై మెరవని ఈ భామ.. చేతిలో మాత్రం వరుసగా మూడు యంగ్ హీరోల సినిమాలలో నటిస్తోంది. త్వరలోనే ఇవి రిలీజ్​కు రెడీ అయ్యాయి. ఆర్స్​ ఎక్స్ 100 ఫేమ్​ యంగ్ హీరో కార్తీకేయతో 'బెదురులంక 2012', మాస్ కా దాస్ విశ్వక్ సేన్​తో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', డైనమిక్ హీరో కిరణ్ అబ్బవరంతో 'రూల్స్ రంజన్' చిత్రాల్లో నటిస్తోంది.

అయితే ఈ మూడు సినిమాలు ప్రస్తుతం ప్రమోషన్స్​లో ఫుల్​ బిజీగా ఉంటూ వరుస అప్డేట్స్ అండ్ సర్​ప్రైజెస్​ ఇస్తున్నాయి. రీసెంట్​గా రూల్స్​ రంజన్​ నుంచి 'సమ్మోహనుడా' సాంగ్ రిలీజ్ అవ్వగా.. తాజాగా 'బెదురులంక 2012' ట్రైలర్​, సాంగ్స్​.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి 'సుట్టంలా సూకి పోకలా' సాంగ్​ విడుదలై అభిమానులను అలరించాయి. ఈ క్రమంలోనే 'సుట్టంలా సూకి పోకలా' సాంగ్ ప్రమోషన్​లో భాగంగా నెహాశెట్టి-విశ్వక్​ సేన్ కలిసి స్టేజ్​పై ఓ హుక్‌ స్టెప్‌ వేసి నెట్టింట్లో ట్రెండింగ్ మారారు. స్టేజ్​పైనే వారిద్దరి కెమిస్ట్రీ హైలైట్​గా నిలిచింది. దీంతో ఆమె మరోసారి నెట్టింట్లో ట్రెండింగ్​గా మారింది.

ఇంకా ఈ సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన ఈ మూడు చిత్రాల్లోని పాటలే కనిపిస్తున్నాయి. ఈ పాటల్లో ఆమె లుక్స్​.. హీటెక్కించేస్తున్నాయి. సోషల్​మీడియాలో అంతా ఈమెదే డామినేషన్ కనిపిస్తోంది. నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్​ అంతా ఈమెనె తెగ షేర్​ చేస్తూ ఆమె అందాల్ని, పాటల్ని తెగ ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సాధారణంగానే చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్యూట్ అండ్ బోల్డ్ ఫొటోషూట్స్​ కుర్రాళ్ల ఫ్యూజలను పొగొడుతుంటుంది. ఆమె ఇచ్చే పోజులకు యూత్​ బుర్రలు గల్లంతైపోతుంటాయి.

తాజాగా ఆమె ఆరెంజ్ కలర్​ డ్రెస్​లో అదిరిపోయే పోజులతో కనువిందు చేసింది. క్లోజప్ షాట్​లో చురకత్తిలాంటి చూపులతో మెస్మరైజ్ చేసింది. ఒక్కో పోజు చూస్తుంటే మతిపోయేలా అనిపించాయి. ఇంకా చెప్పాలంటే ఆమె గ్లామర్​, లుక్స్​ అభిమానులను హీటెక్కింటాయి. ఇవి చూసిన నెటిజన్లు నేహాశెట్టి పిక్స్​ను లైక్స్, కామెంట్స్, షేర్ చేయకుండా ఉండలేకపోతున్నారు. హాట్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ బాక్స్​లను హోరెత్తిస్తున్నారు.