Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : అందాల ఐఫిల్ వద్ద అందాల రాధిక

ఇప్పటికి కూడా ఈ అమ్మడిని చాలా మంది డీజే టిల్లు లవర్‌ రాధిక అనే పిలుస్తున్నారు

By:  Tupaki Desk   |   15 July 2024 6:30 AM GMT
పిక్ టాక్‌ : అందాల ఐఫిల్ వద్ద అందాల రాధిక
X

మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈ అమ్మడు ఆ వెంటనే గల్లీ రౌడీ అనే సినిమాలో కూడా నటించింది. మొదటి రెండు సినిమాలో నిరాశ పరిచినా కూడా అదృష్టం కొద్ది సిద్దు జొన్నలగడ్డ తో కలిసి నటించిన డీజే టిల్లు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

డీజే టిల్లు సినిమాలో ఈమె పోషించిన రాధిక పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పటికి కూడా ఈ అమ్మడిని చాలా మంది డీజే టిల్లు లవర్‌ రాధిక అనే పిలుస్తున్నారు. టిల్లు స్క్వేర్ లో కూడా కనిపించిన విషయం తెల్సిందే. ఇక సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా నేహా శెట్టి అందాల విందు చేస్తూ ఉంటుంది.

తాజాగా అందాల నగరం పారిస్ కు వెళ్లిన నేహా శెట్టి అక్కడ అందమైన ఐఫిల్ టవర్ వద్ద ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఐఫిల్ టవర్ అందంను డామినేట్‌ చేసే విధంగా నేహా శెట్టి అందం ఉంది అంటూ ఆమె ఫ్యాన్స్ తో పాటు సోషల్‌ మీడియాలో ఉన్న వారు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆకట్టుకునే అందం తో పాటు నటన విషయంలో మంచి మార్కులు సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. డీజే టిల్లు తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమా కోసం, హిట్‌ కోసం ఈ అమ్మడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మ

ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్‌ సినిమా ను చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టాడు. కనుక క్యూట్‌ లో రాధిక పాత్ర పరిధి ఎక్కువ ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. రెండో పార్ట్‌ లో వచ్చిన లిల్లీ తో పోల్చితే రాధిక బెటర్ అన్నట్లుగా టిల్లు వ్యాఖ్యలు చేస్తాడు. కనుక క్యూబ్‌ లో మళ్లీ రాధిక ను ఏమైనా లైన్ లో పెట్టేనా అనేది చూడాలి.