నేహా శెట్టి.. చీరలో మళ్ళీ హీటెక్కించేలా..
బ్లూ కలర్ చీరలో అమ్మడు తన ఎద అందంతో పాటు నడుము అందాలను కూడా మరింత హైలెట్ చేస్తూ కనిపించింది.
By: Tupaki Desk | 28 Aug 2023 3:38 PM GMTప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువ హీరోయిన్స్ కు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. కొత్తగా వచ్చి ఒక్క హిట్ కొట్టినా కూడా స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చే సమయం ఇది. అందుకే ఈ సమయాన్ని కరెక్ట్ గా వాడుకోవాలి అని హీరోయిన్స్ గ్లామర్ విషయంలో గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. అలాగే మంచి నటిగా కూడా గుర్తింపు అందుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.
ఇక ఇటీవల కాలంలో బాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేర్లలో నేహా శెట్టి కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. నేహా మొదట అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం తన గ్లామర్ తోనే ఎక్కువగా క్రేజ్ అందుకుంటోంది. మెహబూబా సినిమాతో తెలుగు తెర కు పరిచయమైన అమ్మడు ఆ తర్వాత డీజే టిల్లు సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.
ఆ సినిమా తర్వాత అసలు ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడడం లేదు. కేవలం యువ హీరోలతో మాత్రమే కాకుండా అగ్ర హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది. ఇక గ్లామర్ విషయంలో కూడా అసలు తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకునే విధంగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను ఎంతగానో ఎటాక్ట్ చేస్తుంది.
ఇక రీసెంట్ గా కూడా అమ్మడు చీరలో కనిపించిన విధానం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్లూ కలర్ చీరలో అమ్మడు తన ఎద అందంతో పాటు నడుము అందాలను కూడా మరింత హైలెట్ చేస్తూ కనిపించింది. ఇక చీరలో విభిన్నమైన రకాల స్టిల్స్ ఇస్తూ మరింత అట్రాక్టివ్ గా కనిపించింది. గతంలో కూడా అమ్మడు చీరలో తన గ్లామరస్ లుక్స్ తో బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ చీరలో మాత్రం మరింత అందంగా ఉంది అంటూ ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ఇటీవల కార్తికేయతో చేసిన బెదురులంక 2012 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా డీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకుంటుంది. మొత్తానికి తన గ్లామర్ తో మరోసారి ఈ బ్యూటీ సినిమాల్లో కూడా హైలెట్ అయ్యింది. ప్రస్తుతం విశ్వక్సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చేస్తున్న అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తోంది.