Begin typing your search above and press return to search.

చిరుత పిల్ల ఛార్మింగ్ స్టైల్!

చిరుత సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ నేహా శర్మ.

By:  Tupaki Desk   |   3 Aug 2024 10:30 AM GMT
చిరుత పిల్ల ఛార్మింగ్ స్టైల్!
X

చిరుత సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ నేహా శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఇక గ్లామర్ పరంగా కూడా అదిరిపోయే ఫీచర్స్ తో కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకునే రేంజ్ లో ఉందనే మాట వినిపించింది. అయితే ఏమైందో చిరుత తర్వాత టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో నేహా శర్మ అవకాశాలు సొంతం చేసుకోలేదు.

ఆ చిత్రం తర్వాత వరుణ్ సందేశ్ కి జోడీగా కుర్రాడు అనే సినిమాలో నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. 2010లో క్రోక్ సినిమాతో నేహా శర్మ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడి నుంచి అడపాదడపా హిందీలో మూవీస్ చేస్తూ వస్తోంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా సోలో అనే సినిమాలో నేహా శర్మ నటించింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఈ అమ్మడు బాగానే సక్సెస్ అయ్యింది. అయితే స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ ని మాత్రం అందుకోలేదు.

చివరిగా తెలుగులో హాయ్ నాన్న సినిమాలో నేహా శర్మ క్యామియో రోల్ లో కనిపించింది. గత ఏడాది జోగిరా సరరా అనే సినిమాలో నేహా శర్మ హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం నేహా శర్మకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో నేహా శర్మ గ్లామర్ ఫోటోషూట్ లని షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తన యాక్టివిటీస్ కి సంబందించిన అప్డేట్స్ కూడా ఇస్తుంది.

దీంతో ఇన్ స్టాగ్రామ్ లో నేహా శర్మని ఏకంగా 21 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. ఈ బ్యూటీ ఒక్క ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తే లక్షల్లో లైక్స్ వస్తాయి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ అమ్మడు కాఫీ కప్పు చేత్తో పట్టుకొని దానివైపు అలా చూస్తున్న పిక్ ఒకటి షేర్ చేసింది. దీనిపై పోస్ట్ కూడా రాసింది.

ఏం చేస్తే మీ మనస్సు సంతోషంగా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటూ నేహా శర్మ పోస్ట్ లో మెన్షన్ చేసింది. వెస్ట్రన్ అవుట్ ఫిట్ ధరించి ఈ ఫోటోలలో నేహా శర్మ చాలా ఛార్మింగ్ స్మైల్ తో మెరిసిపోతోంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.