Begin typing your search above and press return to search.

అణుపితామ‌హునికి భార‌త పౌర‌స‌త్వాన్ని ఆఫర్ చేసిన నెహ్రూ

1954లో జవహర్‌లాల్ నెహ్రూ ఓపెన్ హైమ‌ర్ కి అద్భుత‌మైన అవ‌కాశం క‌ల్పించారు.

By:  Tupaki Desk   |   26 July 2023 2:37 PM GMT
అణుపితామ‌హునికి భార‌త పౌర‌స‌త్వాన్ని ఆఫర్ చేసిన నెహ్రూ
X

క్రిస్టోఫ‌ర్ నోలాన్ తెర‌కెక్కించిన ఓపెన్‌హైమ‌ర్ భార‌త‌దేశం లో 50కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఇది అమెరిక‌న్ అణుబాంబ్ పితామ‌హుడు J రాబర్ట్ ఒపెన్‌హైమర్ జీవితక‌థ‌తో తెర‌కెక్కించిన బ‌యోపిక్. ప్ర‌స్తుతం ఈ సినిమా పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా భార‌త‌దేశం లోని మేధావుల్లో దీనిపై అపార‌మైన చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు భార‌త‌దేశ మాజీ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూతో ఓపెన్ హైమ‌ర్ స్నేహం గురించి కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

J రాబర్ట్ ఒపెన్‌హైమర్ జీవిత చరిత్రకు సహ రచయిత అయిన కై బర్డ్ 1954లో జవహర్‌లాల్ నెహ్రూ ఓపెన్ హైమ‌ర్ కి అద్భుత‌మైన అవ‌కాశం క‌ల్పించారు. తన స్వంత ప్రభుత్వం వ‌ల్ల అవ‌మానానికి గురైన ఓపెన్ హైమ‌ర్ కి భారత పౌరసత్వాన్ని క‌ల్పించేందుకు నెహ్రూ సిద్ధ‌మ‌య్యార‌ని కైబ‌ర్డ్ చెప్పాడు. ఓపెన్ హైమ‌ర్ జీవితం జీవించిన‌ సమయాల ను దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తాజా బ‌యోపిక్ చిత్రం లో నాటకీయంగా చూపించారు.

హిరోషిమా - నాగసాకి పై బాంబు పేలుళ్ల తర్వాత ఒపెన్ హైమర్ డీప్ డిప్రెషన్ లో పడిపోయాడని.. మార్టిన్ జె షెర్విన్‌తో కలిసి 'అమెరిక‌న్ ప్ర‌మోథియ‌స్: ది ట్రైఅంప్ అడ్ ట్రాజెడీ ఆఫ్ జె రాబ‌ర్ట్ ఓపెన్ హైమ‌ర్' (American Prometheus: The Triumph and Tragedy of J Robert Oppenheimer) అనే పుస్తకాన్ని రచించిన బర్డ్ హిందూస్తాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఓపెన్ హైమ‌ర్ తదనంతరం అణుశక్తి నియంత్రణ కోసం న్యాయవాదిగా మారాడు. కానీ మెక్‌కార్తీ కాలంలో కంగారూ(ఆస్ట్రేలియ‌న్) కోర్టులో విచారించబడ్డాడు అని కూడా తెలిపాడు.

త్రిసభ్య సలహాదారు బర్డ్ ఇంకా చాలా విష‌యాల‌ను బ‌హిర్గ‌తం చేసారు. 1954లో త‌న స్వ‌దేశం అయిన అమెరికాలో అవమానానికి గురైన తర్వాత... ఓపెన్ హైమ‌ర్ ని భారత్ కు వ‌చ్చేయాల్సిందిగా నెహ్రూ కోరార‌ ని.. ఇక్క‌డికి వచ్చి పౌరసత్వం పొందాల‌ ని ఆఫర్ ఇచ్చార‌ని .. కానీ లోతైన దేశభక్తి కలిగిన అమెరికన్ కాబట్టి ఓపెన్‌హైమర్ దాని ని తీవ్రంగా పరిగణించాడని నేను అనుకోను... అంటూ బ‌ర్డ్ ఆ పుస్త‌కంలో రాసారు. ఓపెన్ హైమ‌ర్ దేశభక్తి అతన్ని మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో పని చేయడానికి పురికొల్పింది.

''హిరోషిమా-నాగసాకి పై అణుబాంబ్ దాడి త‌ర్వాత ఆ న‌గ‌రాల్లో ఏం జ‌రిగిందో ఓపెన్ హైమ‌ర్ తెలుసుకున్నాడు. పదివేల మంది ప్రజలు తక్షణమే ద‌హ‌న‌మ‌య్యార‌ని తెలుసుకున్నాడు. అతను వాస్తవానికి రెండు బాంబు దాడుల తర్వాత తీవ్ర నిరాశ కు గురయ్యాడు. ఆ త‌ర్వాత అతడు కోలుకున్నాడు. కానీ వెంటనే మాట్లాడటం ప్రారంభించాడు'' అని బర్డ్ త‌న పుస్త‌కం లో చెప్పారు. సాంప్రదాయ ఆయుధాల ద్వారా జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తరువాత అణుబాంబ్ త‌యారీ ప్రాజెక్ట్‌లో పనిచేసిన అణు భౌతిక శాస్త్రవేత్తలు .. ముఖ్యంగా అప్పటికే ఓడిపోయిన శత్రువుకు వ్యతిరేకంగా ఆయుధాన్ని ఎందుకు నిర్మించడం కొనసాగించాన్నారో అర్థం కాక‌ ఆశ్చర్యపోయారు.

సిలియన్ మర్ఫీ టైటిల్ పాత్ర‌లో నటించిన ఓపెన్‌హైమర్ విమర్శనాత్మకంగా వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఈ చిత్రం భారతదేశం లో రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం నాలుగు రోజులకే ప్రపంచవ్యాప్తంగా $180 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఇది దాదాపు రూ.1400 కోట్లకు స‌మానం. ఈ సినిమా ముగింపు నాటికి 200 మిలియ‌న్ డాల‌ర్లు పైగా వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమా దాదాపు 100 మిలియ‌న్ డాల‌ర్ల‌ (700 కోట్లు) బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌గా దాదాపు రెట్టింపు ఆదాయాన్ని ఆర్జించింది.