Begin typing your search above and press return to search.

నెలన్స్ నెక్ట్స్.. ఆ నలుగురిలో ఎవరితో..

సౌత్ ఇండస్ట్రీ థియేటర్లలో అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ 'జైలర్'​ మేనియానే కనిపిస్తోంది

By:  Tupaki Desk   |   18 Aug 2023 11:30 PM GMT
నెలన్స్ నెక్ట్స్.. ఆ నలుగురిలో ఎవరితో..
X

సౌత్ ఇండస్ట్రీ థియేటర్లలో అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ 'జైలర్'​ మేనియానే కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్​ను షేక్​ చేస్తూ ఇప్పటికు రూ.400కోట్ల వరకు వసూళ్లను అందుకుంది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్​ కుమార్​పై సినీ ప్రియులు, సెలబ్రిటీలు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.

అలానే వారి మదిలో పలు ప్రశ్నలు కూడా మెదులుతున్నాయి. నెల్సన్ తన తదుపరి చిత్రంలో ఎవరితో చేయనున్నారు ఈ సారి ఎలాంటి కథతో రానున్నారు సహా పలు ప్రశ్నలు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే నెల్సన్ తర్వాత చేయబోయే హీరోల గురించి పలు పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, ధనుశ్, దళపతి విజయ్, శింభు పేర్లు ట్రెండ్ అవుతున్నాయి.

ఇప్పటికే నెల్సన్.. తన మూడో చిత్రాన్ని దళపతి విజయ్ తో బీస్ట్ చేశారు. ఆ చిత్రం మంచి వసూళ్లను అందుకున్నప్పటికీ.. కథ పరంగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే జైలర్ సీక్వెల్ గా నెల్సన్ ఓ సినిమా చేయాలని, అందులో విజయ్ కీలక పాత్ర పోషించేలా ప్లాన్ చేస్తున్నారని తాజాగా టాక్ నడిచింది. లేదంటే ఓ సినిమా అయినా చేసే అవకాశముందని అన్నారు. అలాగే ఆ మధ్యలో ధనుశ్ పేర కూడా బాగా వినిపించింది.

నెల్సన్.. 2018లో 'కోలమావు కోకిల' ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత శివ కార్తికేయన్​తో 'డాక్టర్‌' చేసి డబుల్ హిట్ అందుకున్నారు. అయితే కోలమావు ముందు.. ఆయన శింబుతో కలిసి వెట్టై మన్నన్ సినిమాను ప్రారంభించగా అది కొద్ది రోజులకే ఆగిపోయింది. శింబుతో మళ్లీ ఆ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

అయితే ఇప్పుడు కమల్ హాసన్ పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే జైలర్ సక్సెస్ ఇంటర్వ్యూలో నెల్సన్.. కమల్ గురించి మాట్లాడారు. బీస్ట్‌ సినిమా రిలీజయ్యాక కమల్‌ హాసన్‌ను కలిసినట్లు, ఇద్దరు కలిసి ఓ సినిమా చేసే ప్రయత్నం కూడా జరిగిందని చెప్పారు. స్టోరీ రెడీ అయితే తమ కలయికలో తప్పకుండా సినిమా ఉంటుందన్నారు. జైలర్‌ రిలీజ్ అయ్యాక.. కమల్‌ ఫోన్‌ చేసి అభినందించారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కూడా.. నెల్సన్ తర్వాత చేయబోయేది కమల్ తోననేలా మరింత బలం చేకూర్చాయి.

కమల్ ఇప్పుడు శంకర్ తో ఇండియన్ 2, కల్కి, మణిరత్నంతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాల తర్వాత ఏ సినిమా గురించి వివరాలు తెలియలేదు. వీటిలో ఇండియన్ 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కల్కి కమల్ పాత్రకు సంబంధించిన షూట్ ఈ మధ్యే మొదలైందని అన్నారు. మణిరత్నం చిత్రం ఇంకా షురూ కాలేదు. చూడాలి మరి నెల్సన్ - కమల్ సినిమా ఎప్పుడూ ప్రారంభంమవుతుందో..