నేపాల్ అమ్మాయిలు కుర్చీ మడత పెట్టడం చూశారా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 22 Jan 2025 9:45 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. కానీ సినిమాలోని పాటలకు మంచి స్పందన వచ్చింది. సంగీత దర్శకుడు తమన్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ ఏడాది దాటుతున్నా సోషల్ మీడియాలో కుమ్మేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సార్లు యూట్యూబ్‌లో ప్లే అయిన పాటగా కుర్చీ మడతపెట్టి నిలిచింది. 2024లో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఓ రేంజ్‌లో ఊపు ఊపిన విషయం తెల్సిందే. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌ను రాబట్టుకున్న కుర్చీ మడత పెట్టి విదేశాల్లోనూ తెగ మోగుతోంది.
భాష తెలియకున్నా విదేశీ యూత్ కుర్చీ మతడత పెట్టి సాంగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాకుండా పాటకు మంచి డాన్స్ స్కోప్ ఉన్న కారణంగా ఎంతో మంది ఇతర భాషల వారు కుర్చీ మడత పెట్టి పాటకు డాన్స్ చేశారు. ఇండియాలోని ఇతర భాషల వారు లక్షలాది మంది సోషల్ మీడియా ద్వారా కుర్చీ మడతపెట్టి పాటకు డాన్స్ చేసి రీల్స్‌ని షేర్ చేశారు. స్టేజ్ షోలు, రోడ్ షోలు ఇలా యూత్ ఎక్కడ గేదర్ అయినా కుర్చీ మడతపెట్టి సాంగ్ పెట్టాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో నేపాలీ అమ్మాయిలు డాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు వారు వేస్తున్న స్టేప్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ఇద్దరు అమ్మాయిలు పోటీ పడి మరీ ఆ స్టెప్స్ వేస్తూ ఉంటే చూస్తున్న వారు కేకలు పెడుతున్నారు. శ్రీలీల, మహేష్ బాబు వేసినట్లుగానే వారు స్టెప్స్ వేస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ స్థాయిలో పాటకు స్పందన రావడం పట్ల గతంలో పలు సార్లు తమన్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈసారి పాట నేపాల్‌లో ఈ రేంజ్‌లో ట్రెండ్ కావడం మరింతగా హైలైట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఇదే పాటకు నేపాల్ యూత్ దాదాపుగా వంద మంది మాస్ డాన్స్ చేసి వైరల్ అయ్యారు. నేపాల్‌లో ఈ పాట క్రేజ్ చూసి అంతా షాక్ అవుతూ ఉన్నారు.
కుర్చీ మడత పెట్టి అంటూ సాంగ్ వచ్చిన సమయంలో చాలా మంది విమర్శించారు. యూత్‌కి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. చాలా మంది మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ స్థాయికి ఈ పాట తగదు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. మొత్తంగా కుర్చీ మడత పెట్టి పాటను చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. పాటకు వచ్చిన స్పందన చూసి అప్పుడు ట్రోల్ చేసిన వారు ఇప్పుడు ఏం అంటారు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయినా కుర్చీ మడత పెట్టి సాంగ్ ఈ స్థాయిలో హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని మహేష్ బాబు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.