డైరెక్టర్లందరినీ మెప్పిస్తున్న మినీ సిరీస్
నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సిరీస్ మంచి మౌత్ టాక్ తో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.
By: Tupaki Desk | 19 March 2025 10:30 PM ISTనెట్ ఫ్లిక్స్ తమ సబ్‌స్క్రైబర్లకు ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ సిరీస్‌లు, సినిమాలను అందిస్తూ సర్‌ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ మరో మంచి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అదే అడోలెసెన్స్ మినీ సిరీస్. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సిరీస్ మంచి మౌత్ టాక్ తో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.
ఈ సిరీస్ లో స్టోరీ టెల్లింగ్ దగ్గరి నుంచి నటీనటుల పెర్ఫార్మెన్స్‌ల వరకు ప్రతీదీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీటితో పాటూ సిరీస్ లో మరెన్నో ఆసక్తికర అంశాలున్నాయి. ఈ మినీ సిరీస్ చూసిన ప్రముఖ డైరెక్టర్లు అనురాగ్ కశ్యప్, శేఖర్ కపూర్, హన్సల్ మెహతా అడోలెసెన్స్ ను ఎంతగానో ప్రశంసించారు.
ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఈ సిరీస్ లోని ప్రతీ ఎపిసోడ్‌ను ఒకే షాట్ లో తీశారట. సిరీస్ మొత్తం ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతుంది. తన క్లాస్‌మేట్ కేటీని కత్తితో పొడిచి చంపాడనే ఆరోపణతో 13 ఏళ్ల జేమీ మిల్లర్ ను అరెస్ట్ చేయడంతో ఈ సిరీస్ మొదలవుతుంది. అక్కడి నుంచి ప్రతీ సీన్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కింది.
జామీ అరెస్ట్ అవడం, వెంటనే నేరం ఋజువు అవడం, ఇన్వెస్టిగేటర్లు హత్య వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడం జరుగుతాయి. మరోవైపు జేమీ తల్లిదండ్రులు ఎలాగైనా తమ కొడుకుని జైలు నుంచి బయటకు తీసుకురావాలని కష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మినీ సీరిస్ ప్రతీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంటూ ఆడియన్స్ ను మెప్పించింది.
అయితే ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాను మరింత రక్తి కట్టేలా చూపించడానికి డైరెక్టర్ బరంటిని ప్రతీ ఎపిసోడ్ ను సింగిల్ టేక్ లోనే షూట్ చేయాలనుకున్నాడట. కెమెరాలో మొదట రికార్డ్ బటన్ ను నొక్కితే మళ్లీ ఆ ఎపిసోడ్ అయ్యేవరకు స్టాప్ బటన్ ను నొక్కలేదని డైరెక్టర్ నెట్ ఫ్లిక్స్ తో తెలిపాడు. గత వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ మినీ సిరీస్ ను చూసిన ప్రతీ ఒక్కరూ ఎంతో బావుందని దాన్ని ప్రశంసిస్తున్నారు.