80 కోట్లు ఖర్చు చేసి మూలన పడేసారు!
పాన్ ఇండియాలో సంచలనం సృష్టించిన `బాహుబలి` ప్రాంచైజీని నెట్ ప్లిక్స్ లో సిరీస్ గా తీసుకురావాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. `బాహుబలి: బిపోర్ ది బిగినింగ్` పేరుతో 2018లోనే ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టింది.
By: Tupaki Desk | 24 Nov 2024 9:07 AM GMTపాన్ ఇండియాలో సంచలనం సృష్టించిన `బాహుబలి` ప్రాంచైజీని నెట్ ప్లిక్స్ లో సిరీస్ గా తీసుకురావాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. `బాహుబలి: బిపోర్ ది బిగినింగ్` పేరుతో 2018లోనే ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టింది. దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ కూడా చేసారు. ఔట్ పుట్ సరిగ్గా రాకపోవడంతో ఆ టీమ్ ని పక్కనబెట్టి మరో టీమ్ తో కూడా రంగంలోకి దించి పనిచేయించింది. కానీ అప్పుడు కూడా సంతృప్తి చెందకపోవడంతో ప్రాజెక్ట్ ని పక్కనబెట్టేసింది.
ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకే విషయం బయటకు రాలేదు. తాజాగా ఆ సిరీస్ లో నటించిన బిజయ్ ఆనంద్ సిద్దార్ధ్ కన్నన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తిర విషయాలు పంచుకున్నాడు. ఈసిరీస్ కోసం నెట్ ప్లిక్స్ 80 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. తాను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రెండేళ్లు పనిచేసానన్నారు. సరిగ్గా ఇదే సమయంలో `సాహో` సినిమాలో అవకాశం వచ్చిందన్నారు. కానీ బాహుబలి సిరీస్ షూటింగ్ సమయంలో బిజీగా ఉండటంతో వచ్చిన ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలిపాడు.
`బాహుబలి ది బిగినింగ్` ముందు కథని సిరీస్ రూపంలో తీసుకు రావాలని ప్రయత్నించారు. హిట్ అయిన ప్రాంచైజీ కావడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ అనూహ్యంగా ఆ వివరాలేవి తర్వాత వెలుగులోకి రాలేదు. బిజయ్ ఆనంద్ మాటల్ని బట్టి 80 కోట్లు బూడిదలో పోసిన పన్నీరుగానే పోయినట్లు తెలుస్తోంది. పూర్తిగా ఈ ప్రాజెక్ట్ ని ఆపే సినట్లు క్లారిటీ వస్తుంది. వృద్ధా అయిన డబ్బు సంగతి పక్కన బెడితే రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ లో పని చేసిన వారు చాలా అవకాశాలు కోల్పోయి ఉంటారని తెలుస్తోంది.
ఈ సిరీస్ దేవకట్టా దర్శకత్వం వహించారు. అప్పటికే ఆయనకు దర్శకుడిగా అవకాశాలు తగ్గాయి. ట్యాలెంటెడ్ మేకర్ అయినా? `బాహుబలి` సిరీస్ తో కంబ్యాక్ అవుతాడని ఆశించారు కానీ ఛాన్స్ మిస్ అయింది. దర్శకుడిగా చివరిగా సాయి దుర్గ తేజ్ తో `రిపబ్లిక్` సినిమా చేసాడు. ఈ సినిమా కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ కమర్శియల్ గా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం `జె డీఆర్` వర్కింగ్ టైటల్ తో ఓ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు.