లేడీ సూపర్ స్టార్ పర్సనల్ లైఫ్ ని టచ్ చేస్తున్నారా?
ఇటీవలే దేశం గర్వించ దగ్గ దర్శకుడు రాజమౌళిపై డాక్యుమెంటరీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 Oct 2024 7:30 PM GMTఎంటర్ టైన్ మెంట్ ట్రెండ్ మారిన తరుణం ఇది. సినిమాల్ని మించి వండర్స్ ని నెట్ ప్లిక్స్ క్రియేట్ చేస్తోంది. వెబ్ సిరీస్ లు..డాక్యుమెంటరిలతో సినిమాల్ని మించిన ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాయి. బయోపిక్ ల్ని డాక్యు మెంటరీల రూపంలో తీసుకొచ్చి మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రెండింగ్ సెలబ్రిటీల కథలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే దేశం గర్వించ దగ్గ దర్శకుడు రాజమౌళిపై డాక్యుమెంటరీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతారపై 'బియాండ్ ది ఫెయిరీ టైల్' పేరుతో ఓ స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుం ది. నవంబర్ 18 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నయనతార కథని చెప్పబోతున్నారు. అయితే ఈ కథని ఎంత వరకూ తీసుకున్నారు? అన్నది తెలియాలి. అన్ని విషయాలు ఓపెన్ గా కుదించి చెబుతున్నారా? లేక కొంత వరకూ పరిమితం చేస్తున్నారా? అన్నది చూడాలి. నయనతార ఇండస్ట్రీలో ఎలా ఎదిగింది అన్నది తెలిసిందే.
చిన్న పాత్రతో నటిగా పరిచయమై హీరోయిన్ అయింది. అటుపై లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. వ్యక్తిగత జీవితంలో నూ ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. విగ్నేష్ కంటే ముందు ఆమె పలువురి నటులతో ప్రేమాయ ణాలు అప్పట్లో ఓ సంచలనం. అలాగే సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కాదు అనే రిమార్క్ అమ్మడిపై ఉంది. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ప్రమోట్ చేయదనే విమర్శ చాలా కాలంగా ఎదుర్కుంటుంది.
ఇండస్ట్రీలో ఎంతో మంది లేడీ సూపర్ స్టార్లు ఉన్నా? నయన్ మాత్రం వాళ్లకు భిన్నమైన మార్గంలో వెళ్తుంది. ప్రచార పరంగా ఎందుకు పాల్గొనదు? అన్నది తనకి మాత్రమే తెలిసు. అందులో లాభనష్టాల్ని తాను మాత్రమే బేరీజు వేసుకుని ప్రయాణం సాగిస్తుంది. మరి ఇలాంటి అంశాలు బియాండ్ ది పెయిర్ లో చెబుతున్నారా? లేదా? అన్నది చూడాలి.