అనుష్క శర్మతో నెట్ ప్లిక్స్ గొవడ!
నెట్ ప్లిక్స్ ఇండియా-క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ భాగస్వామ్యం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు తెకెక్కాయి.
By: Tupaki Desk | 22 March 2024 7:32 AM GMTనెట్ ప్లిక్స్ ఇండియా-క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ భాగస్వామ్యం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు తెకెక్కాయి. `బుల్` బుల్`..కాలా.. కోహ్రా లాంటి సందేశాత్మక సినిమాల్ని ఈ రెండు సంస్థలే నిర్మించాయి. ప్రస్తుతం అనుష్క శర్మ ప్రధాన పాత్ర `చక్దా ఎక్స్ ప్రెస్` కూడా నిర్మిస్తున్నాయి. దీంతో పాటు `ఆప్గానీ న్నో` కూడా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ రెండు నిర్మాణ దశలో ఉన్నాయి . అయితే తాజాగా నెట్ ప్లిక్స్- క్లీన్ స్లేట్ సంస్థలు తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి.
`చక్దా ఎక్స్ ప్రెస్` బడ్జెట్ విషయంలో రెండు సంస్థల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియా లో కథనాలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడీ రెండు సినిమాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి. అవి ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ రెండు సినిమాలు ఇప్పట్లో రిలీజ్ కావని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో రెండు సంస్థల మధ్య అండర్ స్టాండింగ్ కుదిరే వరకూ తాత్కాలికంగా వాటిని పక్కనబెట్టినట్లేనని తెలుస్తోంది.
క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ ని బాలీవుడ్ కి పరిచయం చేసింది అనుష్క శర్మ. ఆమె సోదరుడు కర్ణేష్ శర్మతో కలిసి 2013లో ఈ సంస్థని ప్రారంభించింది అనుష్క. అప్పటి నుంచి నెట్ ప్లిక్స్ తో భాగస్వామిగామారి సినిమాలు నిర్మించింది. కానీ ఇప్పుడు అనుష్క శర్మ నటిస్తోన్న సినిమాతోనే వివాదం నెట్ ప్లిక్స్ తో వివాదం తలెత్తడంతో సన్నివేశం మొత్తం మారిపోతుంది. దీంతో అనుష్క ఇప్పుడు సోలోగా ముందుకొస్తే తప్ప పనవ్వదు.
నెటప్లిక్స్ తో పూర్తిగా తెగదెంపులు చేసుకుని చక్దా ఎక్స్ ప్రెస్ ప్రాజెక్ట్ ని తనహ్యాండ్స్ లోకి తెచ్చుకోవాలి. అందుకు అనుష్క శర్మ చెల్లించాల్సిన మొత్తాన్ని నెట్ ప్లిక్స్ కి చెల్లించాలి. అప్పుడే అది సాధ్యమ వుతోంది. అదే సంస్థతో అనుష్క ఒటీటీ ఒప్పందం కూడా క్రితం చేసింది. ఆ నిర్మాణ సంస్థతతో కలిసే సొంత ప్లాట్ ఫామ్ ని తయారు చేసింది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ ఒప్పందంపై ఆ ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.