Begin typing your search above and press return to search.

ఓటీటీ గ్రౌండ్ లో నెట్ ఫ్లిక్స్ మోత

థియేటర్లో హిట్‌ అయిన సినిమాకు వచ్చినంత ప్రేక్షకాదరణ నేరుగా ఓటీటీలో విడుదలైనవి కూడా దక్కించుకుంటున్నాయి

By:  Tupaki Desk   |   22 Jan 2024 10:54 AM GMT
ఓటీటీ గ్రౌండ్ లో నెట్ ఫ్లిక్స్ మోత
X

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లో హిట్‌ అయిన సినిమాకు వచ్చినంత ప్రేక్షకాదరణ నేరుగా ఓటీటీలో విడుదలైనవి కూడా దక్కించుకుంటున్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఓటీటీ సంస్థలు... పోటీపడి మరీ సినిమాలను కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేస్తున్నాయి.

ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి సంస్థలు తెలుగు కంటెంట్ తో పాటు ఇతర భాషల కంటెంట్ ను కూడా ఎక్కువగా ప్రేక్షకుల కోసం అందిస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా హక్కులను ఇప్పటికే కొనుగోలు చేసేసింది నెట్ ఫ్లిక్స్. అలా అమెజాన్ ప్రైమ్ కు పెద్ద షాక్ ఇచ్చింది. పెద్ద చిత్రాలన్నీ తన గుప్పిట్లో ఉంచుకుంది.

ఇటీవలే నెట్ ఫిక్ల్స్.. తాము హక్కులను కొనుగోలు చేసిన సినిమాల జాబితాను ప్రకటించింది. అందులో మోస్ట్ అవైటెడ్ మూవీలైన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర పార్ట్-1, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సీక్వెల్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు.. ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి. అయితే పుష్ప-1కు వచ్చిన క్రేజ్ చూసిన తర్వాత కూడా అమెజాన్ ప్రైమ్.. పుష్ప-2ను కొనుగోలు చేయకపోవడం గమనార్హం.

విజయ్ దేవరకొండ 12, సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, బాలకృష్ణ 109, కార్తికేయ హీరోగా యాక్షన్ మూవీ(సితార బ్యానర్), సిద్దార్థ్-అదితి రావు హైదరీ హరిలో రంగ హరి, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి, అల్లు శిరీష్ టెడ్డి, ఎస్వీసీసీ 37, నితిన్ నార్నే 2 సినిమాలు నెట్ ఫ్లిక్స్ ప్రకటించిన లిస్టులో ఉన్నాయి. అలా ఈ సినిమాల కోసం ఆరేడు వందల కోట్లకు పైగానే నెట్ ఫ్లిక్స్ ఖర్చు పెట్టి ఉంటుందని టాక్ నడుస్తోంది.

అయితే ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్.. నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 1లో ట్రెండింగ్ అవుతోంది. దీంతోపాటు ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న కల్కి మూవీని కూడా దక్కించుకునేందుకు నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోందట. ఈ డీల్ కానీ ఓకే అయితే.. టాలీవుడ్ అప్ కమింగ్ టాప్ మూవీస్ అన్నీ.. నెటి ఫ్లిక్స్ దగ్గర ఉన్నట్లే. మొత్తం తెలుగు మార్కెట్ ను నెట్ ఫ్లిక్స్ ను శాసించనుందన్నమాట. భారీ చిత్రాల హక్కులను కొనుగోలు చేయడంలో అమెజాన్ ప్రైమ్ వెనుకబడడంతో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ మార్కెట్ లో దూసుకెళ్తోంది.

అయితే ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ సీఈవో బృందం.. హైదరాబాద్ వచ్చి తెలుగు స్టార్ హీరోలందరి ఇళ్లకు వెళ్లింది. వారితో ముచ్చటించి టిఫిన్లు, భోజనాలు చేసింది. ఆ పిక్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో అందుకే నెట్ ఫ్లిక్స్ టీమ్.. హైదరాబాద్ వచ్చి టాలీవుడ్ మేకర్స్ తో భారీ సినిమాల డీల్స్ కుదుర్చుకుందేమోనని నెటిజన్లు అంటున్నారు.