Begin typing your search above and press return to search.

నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రైబర్స్ ఎంత మందో తెలుసా?

ఇండియాలో ఓటీటీ కంటెంట్‌ కి గడచిన మూడు నాలుగు సంవత్సరాల్లో విపరీతమైన ఆదరణ పెరిగింది.

By:  Tupaki Desk   |   24 Jan 2024 8:13 AM GMT
నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రైబర్స్ ఎంత మందో తెలుసా?
X

ఇండియాలో ఓటీటీ కంటెంట్‌ కి గడచిన మూడు నాలుగు సంవత్సరాల్లో విపరీతమైన ఆదరణ పెరిగింది. అయితే హాలీవుడ్ ప్రేక్షకులు అంతకు ముందు నుంచే ఓటీటీ కంటెంట్‌ ను చూస్తూ ఉన్నారు. నెట్‌ ఫ్లిక్స్ ద్వారా గతంలో హాలీవుడ్ కంటెంట్‌ మాత్రమే చూసే వీలు ఉండేది. కానీ ఇప్పుడు స్థానిక భాషల కంటెంట్‌ కూడా అందుబాటులో ఉంది.

నెట్‌ ఫ్లిక్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఎన్నో ఓటీటీలు ఉన్నా కూడా నెట్‌ ఫ్లిక్స్ తర్వాతే అన్నీ కూడా అన్నట్లుగా అందులో కంటెంట్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందుకు తగ్గట్లుగానే వరుసగా సినిమాలను సదరు ఓటీటీ ఇస్తూ ఉంది.

2023 లెక్కల ప్రకారం నెట్‌ ఫ్లిక్స్ కు ప్రపంచ వ్యాప్తంగా 260 మిలియన్ ల సబ్‌ స్క్రైబర్స్ ఉన్నట్లుగా మీడియా సంస్థలు ధృవీకరించాయి. అంటే 26 కోట్ల మంది ప్రపంచంలో నెట్‌ ఫ్లిక్స్ ఖాతాను కలిగి ఉన్నారు. ఇంత భారీ మొత్తంలో మరే ఓటీటీ కి కూడా ఖాతాదారులు లేరు అనేది కన్ఫర్మ్‌.

ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా నెట్‌ ఫ్లిక్స్ సందడి చేస్తోంది. తెలుగు, తమిళ ఇతర భాషల కంటెంట్‌ ను కూడా నెట్‌ ఫ్లిక్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇస్తుంది. దాంతో ఇండియాలో అత్యధికంగా నెట్‌ ఫ్లిక్స్ ఖాతాదారులు అవుతున్నారు.

ఇండియాలో ఉన్న టాప్ ఓటీటీ ల్లో అత్యధిక ఫీజు వసూళ్లు చేసే ఓటీటీ గా నెట్‌ ఫ్లిక్స్ ఉంది. అయినా కూడా అందులో ఉండే కంటెంట్ కారణంగా అత్యధిక సబ్‌ స్క్రైబర్స్ ఇండియాలో ఉన్నట్లుగా కొందరు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో నెట్‌ ఫ్లిక్స్ కి మరింత మంది ఖాతాదారులు అయ్యే అవకాశం ఉంది.