"ది ప్యారడైజ్" - గేమ్ ఆఫ్ థ్రోన్స్ కనెక్షన్లు
తాజాగా విడుదలైన "రా స్టేట్మెంట్" వీడియో చూసిన తర్వాత, చాలా మంది నెటిజన్లు దీన్ని హాలీవుడ్ క్లాసిక్ "గేమ్ ఆఫ్ థ్రోన్స్"తో పోలుస్తున్నారు.
By: Tupaki Desk | 4 March 2025 4:28 PM ISTసినిమాల్లో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, ఇన్‌టెన్స్ పాత్రలు, స్టోరీలైన్ ఎంత కొత్తగా ఉంటే ప్రేక్షకుల అంచనాలు కూడా అంత గట్టిగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో నాని నటిస్తున్న "ది ప్యారడైజ్" సినిమా RAW కంటెంట్ కూడా గ్రాండ్ గా క్లిక్ కావడంతో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. తాజాగా విడుదలైన "రా స్టేట్మెంట్" వీడియో చూసిన తర్వాత, చాలా మంది నెటిజన్లు దీన్ని హాలీవుడ్ క్లాసిక్ "గేమ్ ఆఫ్ థ్రోన్స్"తో పోలుస్తున్నారు.
ముఖ్యంగా నాని లుక్, సినిమా టోన్, నేరేషన్ స్టైల్ చూసిన తర్వాత ఇది ఒక ఎపిక్ లెవెల్ స్టోరీ అనే హైప్ క్రియేట్ అయ్యింది. అందరూ కలల కధానాయకులుగా ఉండాలనుకునే రోజుల్లో, నాని మాత్రం విభిన్నంగా తన కెరీర్‌ని మలుచుకుంటున్నాడు. ఆయన నటించిన పాత్రల్లో ఎప్పుడూ ఎమోషనల్ డెప్త్ ఉంటూనే ఉంటుంది. కానీ ఈసారి "ది ప్యారడైజ్"లో నాని ఓ సైన్యం లీడర్‌లా కనిపిస్తున్నాడని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది.
ముఖ్యంగా టీజట్ చివర్లో వచ్చే "లం*.. కొడుకు కథ" అనే డైలాగ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్‌ను జాన్ స్నో పాత్రను గుర్తు చేసుకునేలా చేసింది. ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్, నాని లుక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా ఓ రా నేటివిటీ కలిగిన పీరియడ్ యాక్షన్ డ్రామాగా భావించడానికి కారణమవుతున్నాయి. ట్రైలర్‌లో చూపించినట్లు కథలో కాకుల తరహాలో మనుషుల జీవనాన్ని కనెక్ట్ చేయడం ఎంతో కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.
ఇదే తరహాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో "నైట్ వాచ్"లా కాకులు కీలక పాత్ర పోషించడమే ఈ పోలికలకు కారణంగా మారింది. ఓ అవుట్‌కాస్ట్ హీరోగా నాని పాత్రను డిజైన్ చేశారా ఆయన విలన్లను ఓడించి లీడర్‌గా ఎదుగుతాడా? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా గతంలో "దసరా" ద్వారా తన రా మేకింగ్ స్కిల్స్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు "ది ప్యారడైజ్" మరింత మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది.
కథలో పాత్రల లేయర్స్, సింబాలిజం అన్నీ కలిపి సినిమాను న్యూ హైప్ కు తీసుకెళ్తున్నాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ఓ స్ట్రాంగ్ లీడర్ పాత్రను నాని పోషిస్తాడా లేదా ఇది పూర్తిగా డిఫరెంట్ స్టోరీనా? అనే విషయం మాత్రం సినిమా విడుదలయ్యాకే క్లియర్ అవుతుంది.న్ఇకపోతే, సోషల్ మీడియాలో ఇప్పటికే మిమ్స్, ఎడిట్స్, థియరీలు పెరిగిపోయాయి. "ది ప్యారడైజ్" గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఓ ఎపిక్ ఫిల్మ్ అవుతుందా లేక దాని రేంజ్‌లో కాకుండా పూర్తి భిన్నమైన తెలుగు మార్కెట్‌కి సరిపడే స్టోరీనా అనే విషయంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తారాస్థాయికి చేరింది.