పుష్ప-2 వసూళ్లు.. మళ్ళీ ఈ డౌట్స్ ఏంటీ?
అయితే ఎన్నడూ లేని విధంగా బాలీవుడ్ తో పాటు నార్త్ అమెరికాలో తెలుగు సినిమా పుష్ప-2 వేరే లెవెల్ లో అలరిస్తోంది. అనేక రికార్డులను బద్దలు కొడుతూ కొత్తవి సృష్టిస్తోంది.
By: Tupaki Desk | 12 Dec 2024 12:30 PM GMTప్రస్తుతం వరల్డ్ వైడ్ గా పుష్ప రాజ్ హవా నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-2.. భారీ రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఆ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఆ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉందని అంతా కొనియాడుతున్నారు. జాతర సీక్వెన్స్ అయితే ఓ రేంజ్ లో ఉందని చెబుతున్నారు. అలా అందరినీ మెప్పిస్తూ దూసుకుపోతున్న పుష్ప-2.. బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా అదిరిపోయే రీతిలో వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది.
ఆరు రోజుల్లో రూ.1002 కోట్ల వసూళ్లను రాబట్టి పుష్ప-2 అరుదైన ఘనత సాధించినట్లు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ తర్వాత భారీ వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రంగా పుష్ప-2 నిలిచింది. అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన ఇండియన్ ఫిల్మ్ గా ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే ఎన్నడూ లేని విధంగా బాలీవుడ్ తో పాటు నార్త్ అమెరికాలో తెలుగు సినిమా పుష్ప-2 వేరే లెవెల్ లో అలరిస్తోంది. అనేక రికార్డులను బద్దలు కొడుతూ కొత్తవి సృష్టిస్తోంది. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కొత్త చర్చ మొదలుపెట్టారు. మేకర్స్ వసూళ్లు కాస్త పెంచి చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఆరు రోజుల్లో రూ.1000 కోట్ల రాబట్టడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో యాంటీ ఫ్యాన్సే ఎక్కువ మంది ఉన్నట్లు కనిపిస్తున్నారు. 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.950 కోట్లు పుష్ప-2 కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు అనేక మంది అంచనా వేశారని, కానీ ఆరు రోజుల్లో రూ.1000 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడం డౌట్ గా ఉందని చెబుతున్నారు.
ఫస్ట్ వీక్ చివర్లో కొన్ని చోట్ల వసూళ్లు తగ్గాయని.. కానీ మేకర్స్ మాత్రం రూ.1002 కోట్లుగా ప్రకటించారని అంటున్నారు. గణాంకాల ద్వారా సినిమా ఇమేజ్ ను పెంచడానికి, కొత్త రికార్డులతో మరింత మంది దృష్టి ఆకర్షించడానికి మేకర్స్ ఇలా చేశారేమోనని కామెంట్లు పెడుతున్నారు. కానీ అసలు లెక్కలు మాత్రం 1000 కోట్లు దాటినట్లు ఏరియాల నెంబర్ల ఆధారంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.