స్టార్ డాటర్‌పై నెటిజనుల ఊహాగానాలు
కమల్ హాసన్- సారిక దంపతులకు ఇద్దరు కుమార్తెలు. శ్రుతిహాసన్-అక్షర హాసన్. ఆ ఇద్దరూ సినీపరిశ్రమలో నటీమణులు.
By: Tupaki Desk | 16 Jan 2025 4:07 AM GMTకమల్ హాసన్- సారిక దంపతులకు ఇద్దరు కుమార్తెలు. శ్రుతిహాసన్-అక్షర హాసన్. ఆ ఇద్దరూ సినీపరిశ్రమలో నటీమణులు. శ్రుతిహాసన్ అగ్ర కథానాయికగా కెరీర్ పరంగా బిజీగా ఉంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నటిగా శ్రుతిహాసన్ కంబ్యాక్ తన పట్టుదలకు నిదర్శనం. రెండుసార్లు ప్రేమలో వైఫల్యం చాలా ఒత్తిడికి గురి చేసినా దాని నుంచి బయటపడింది.
కానీ శ్రుతిహాసన్ సోదరి అక్షర హాసన్ మాత్రం అలా కాదు. నటిగా తాను ఆశించినది అందుకోవడంలో విఫలమైంది. కెరీర్ పరంగా శ్రుతిహాసన్ స్థాయి తనకు లేదు. మరోవైపు వ్యక్తిగతంగాను అక్షర కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటోందని నెటిజనుల్లో ఊహిస్తున్నారు. తన తల్లిదండ్రులు విడిపోవడం వ్యక్తిగతంగా పెద్ద లోటు. అది తనను మానసికంగా కుంగదీసింది. ఇదే విషయాన్ని ఇంతకుముందు శ్రుతిహాసన్ కూడా అంగీకరించింది. కారణం ఏదైనా అక్షర హాసన్ మునుపటిలా లేదు. ఇటీవల అనారోగ్యంగా కనిపిస్తోంది. పైగా కంటి కింద వలయాలు కనిపిస్తున్నాయి.. అంటూ సోషల్ మీడియాల్లో అక్షర లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
కొందరైతే అక్షరహాసన్ మత్తుకు బానిస అయింది అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. డిప్రెషన్ వల్ల మత్తుకు బానిస అయిందని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఒకరి వ్యక్తిగత జీవితంపై ఇతరులు వ్యాఖ్యానించడం ఎంతవరకూ సబబు? ఇది ఆక్షేపణీయం. అక్షర విషయంలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ నెటిజనులు ఇష్టానుసారం ఊహాగానాలు సాగించడం సముచితం కాదు. అక్షర గతంలో షమితాబ్, కదరం కొండన్ వంటి చిత్రాలలో నటించింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది.
అయితే తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న అక్షర హాసన్ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కొద్ది నెలల క్రితం అక్షర రూపం వేరు. ఇప్పుడు తన రూపం వేరు! అంటూ రెండు ఫోటోగ్రాఫ్స్ ని ఒకే చోట చేర్చి రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. అయితే నెటిజనుల అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేలా అక్షర హాసన్ తిరిగి కంబ్యాక్ అవ్వాలని తన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా కెరీర్ పరంగా అక్షర బిజీ అయిపోతే, తనకు తీరిక లేని షెడ్యూళ్లు ఉంటాయి. అది కొన్ని సమస్యలను పరిష్కరిస్తుందని కూడా సూచిస్తున్నారు.