మలైకా ఇంటి పేరుపై ఏంటి ఈ కన్ప్యూజన్?
ఓ యూజర్ మలైకా ఇంటి పేరు అరోరా అని...ఆమె తండ్రి ఇంటి పేరు మెహతా అని రాసుకొచ్చారు.
By: Tupaki Desk | 12 Sep 2024 6:20 AM GMTమలైకా అరోరా తండ్రి ఇంటిపేరుపై గందరగోళం నెలకొందా? ఒకరు అరోరా అంటే? మరొకరు మోహతా ఫ్యామిలీ మెంబర్ గా సందేహం వ్యక్తం చేస్తున్నారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. నిన్నటి రోజున మలైకా అరోరా తండ్రి అనీల్ ఆరోరా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరాణానంతరం అతడి పేరు అనీల్ అరోరాగా తెరపైకి వచ్చింది. అయితే మలైకా అరోరా తండ్రిని అనీల్ మోహతా కులదీప్ మెహతగా అభివర్ణించడం నెట్టింట చర్చనీయాంగా మారింది.
ఓ యూజర్ మలైకా ఇంటి పేరు అరోరా అని...ఆమె తండ్రి ఇంటి పేరు మెహతా అని రాసుకొచ్చారు. మరొకరు అనీల్ మలైకాకి సవతి తండ్రి అని అనుమానం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో మలైకా...అనీల్ మధ్య వయసు వ్యత్యాసాన్ని కూడా ఎత్తి చూపారు. ఇద్దరి మధ్య కేవలం 12 ఏళ్లు వ్యవధి మాత్రమే ఉంది. అనీల్ వయసు 62 కాగా...మలైకా అరోరా వయసు 50 ఏళ్లు. సవతి తండ్రి కావడంతో ఈ వ్యత్యాసం అని అంటున్నారు.
సన్నిహిత వర్గాలు సైతం మలైకాకి అనీల్ సవతి తండ్రిగానే చెబుతున్నాయి. మలైకా మహారాష్ట్రలోని థానేలో జన్మించింది. ఆమె 11 సంవత్సరాల వయస్సులో ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. మలైకా తల్లి , సోదరి అమృతా కలిసి చెంబూర్‌కు వెళ్లిపోయారు. ఆమె తల్లి జాయిస్ పాలీకార్ప్. ఆమె ఒక మలయాళీ క్రిస్టియన్. తండ్రి అనిల్ అరోరా పంజాబీ కుటుంబానికి ఎందిన వ్యక్తి. ఇండియన్ మర్చంట్ నేవీ ఉద్యోగి.
భార్య ఇంట్లో ఉండగానే అనీల్ ఆత్మహత్యకు పాల్లప్డారు. ఈ విషయాన్ని భార్య పోలీసులకు తెలిపారు. అనీల్ ఇంట్లో లేని సమయంలో బయట చెప్పులను గమనించారు. దీంతో ఆమె బాల్కనీలో అతని కోసం వెతికారు. అక్కడ కనిపించలేదు. అప్పుడామె బాల్కనీ రెయిలింగ్‌పైకి వంగి కిందకు చూసేసరికి అనీల్ దూకి చనిపోయినట్లు తెలిసింది.