చైతూ, శోభిత పెళ్లి వేళ… సమంతకి సలహాలు
హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న గ్రాండ్ గా జరిగింది.
By: Tupaki Desk | 6 Dec 2024 1:30 PM GMTహీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్యలో వీరిద్దరూ హిందు సంప్రదాయం ప్రకారం మూడు మూళ్ళ బంధంతో ఒకటయ్యారు. ప్రేమతో పెద్దలను ఒప్పించి ప్రేమబంధాన్ని పెళ్లితో మరో లెవెల్ కు తీసుకొని వెళుతున్నారు. వివాహం తర్వాత కూడా శోభిత యధావిధిగా మూవీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక చైతన్య కూడా ‘తండేల్’ పనుల్లో బిజీ కానున్నాడు.
ఇదిలా ఉంటే వీరిద్దరి వివాహం సందర్భంగా నాగ చైతన్య మొదటి భార్య హీరోయిన్ సమంతకి సపోర్ట్ గా ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ధైర్యం చెబుతున్నారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో నాగ చైతన్య, సమంత పెళ్లి ఫోటో ఒకటి ఉంది. చైతూ బర్త్ డే సందర్భం అతనికి గిఫ్ట్ ఇస్తోన్న ఫోటోని సమంత ఇన్ స్టాగ్రామ్ లో డిలీట్ చేయకుండా అలాగే వదిలేసింది. అయితే ఈ ఫోటోని కూడా పూర్తిగా తొలగించి, అతని జ్ఞాపకాల నుంచి బయటకి రావాలని చాలా మంది సలహాలు ఇస్తున్నారు.
నిజానికి సమంత ఇప్పటికే నాగ చైతన్యతో ఉన్న బంధాన్ని రద్దు చేసుకున్న తర్వాత ఆ జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటకొచ్చింది. ఆరంభంలో మానసికంగా, శారీరకంగా ఎదురయ్యే సవాళ్లని కూడా అధికమించింది. మాయోసైటిస్ బారిన పడినప్పటికి ధైర్యంగా పోరాడి దాని నుంచి బయటపడింది. ఒంటరిగా సవాళ్లని ఎదుర్కొని ఇప్పుడు స్వేచ్ఛగా తనకి ఎం చేయాలనిపిస్తే అది చేస్తోంది. ఇప్పుడు మరింత యాక్టివ్ గా మారి సినిమాలు, సిరీస్ లు చేయడానికి సమంత రెడీ అయ్యింది.
రీసెంట్ గా ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ తో సమంత సక్సెస్ ని అందుకుంది. ఈ సిరీస్ తో ఆమె యాక్షన్ క్వీన్ గా ప్రూవ్ చేసుకొని ఫీమేల్ ఒరియాంటేడ్ మూవీస్ కి ఛాయస్ గా మారింది. హిందీ సినిమాలు, సిరీస్ లపై ఆమె పూర్తిగా ఫోకస్ చేసింది. ఎప్పుడు ఎం చేయాలనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ, ఆలోచనలు ఆమెకి ఉన్నాయని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సమంత చాలా మంది అమ్మాయిలకి ఆదర్శం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. సవాళ్లు ఎదురైనా, వివాహబంధం నుంచి బయటకొచ్చి ధైర్యంగా నిలబడి బలంగా నిరూపించుకుంది. నాగచైతన్యతో ఉన్న ఫోటోలని ఎప్పుడు డిలేట్ చేయాలనేది ఆమె ఇష్టం అని, దీంట్లో ఎవరు సలహాలు అవసరం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగ చైతన్య, శోభిత వివాహం తర్వాత మరోసారి సమంత ట్రెండింగ్ లోకి వచ్చింది.