Begin typing your search above and press return to search.

తెలుగు రిలీజ్ చేస్తే 'ఛావా' 300 కోట్లు దాటేసేదా!

ఛ‌త్ర‌ప‌తి శివాజీ వార‌సుడు శంభాజీ మ‌హారాజ్ జీవిత క‌థ అధారంగా తెర‌కెక్కిన `ఛావా` ఇటీవ‌ల రిలీజ్ అయి భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Feb 2025 4:30 PM GMT
తెలుగు రిలీజ్ చేస్తే  ఛావా 300 కోట్లు  దాటేసేదా!
X

ఛ‌త్ర‌ప‌తి శివాజీ వార‌సుడు శంభాజీ మ‌హారాజ్ జీవిత క‌థ అధారంగా తెర‌కెక్కిన `ఛావా` ఇటీవ‌ల రిలీజ్ అయి భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో షేక్ చేస్తోంది. ఇప్ప‌టికే సినిమా 200 కోట్ల‌కు పైగా సాధించింది. పోటీగా మ‌రే సినిమా కూడా లేక‌పోవ‌డంతో? ఈ వారం కూడా `చావా`దే హ‌వా. అయితే ఇంత గొప్ప చిత్రాన్ని మ‌డాక్ ఫిల్మ్స్ కేవ‌లం హిందీ రిలీజ్ వ‌ర‌కే ప‌రిమితం చేసింది.

ఇంకే భాష‌ల్లోనూ చిత్రాన్ని రిలీజ్ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఈచిత్రాన్ని తెలుగు స‌హా ఇత‌ర భాష‌ల్లో రిలీజ్ చేసి ఉంటే సినిమా ఇప్ప‌టికే 300 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయేద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికీ మించిపోలేద‌ని తెలుగు-డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేయాలని నెటి జ‌నులు సోష‌ల్ మీడియా వేదికగా మ‌డాక్ సంస్త‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి గొప్ప అవకాశం ఉందని చాలా మంది నమ్ముతారు.

ప్ర‌స్తుతం తెలుగులో కూడా ఏ సినిమా కూడా పోటీగా లేదు. తండేల్ ఉన్నా? ఇప్పటికే చూడ‌ల్సిన వారంతా చూసేసారు. ఈనేప‌థ్యంలో `ఛావా` తెలుగులో రిలీజ్ అయి ఉంటే? మంచి ఆద‌ర‌ణ ద‌క్కేది. ఇది చరిత్ర‌ను ఆధారంగా చేసుకుని ఓ యోధుడి క‌థ‌ను తెర‌కెక్కించిన నేప‌థ్యంలో తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చేది. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లో రిలీజ్ చేస్తే వేరే లెవ‌ల్లో ఉండేది.

కానీ మ‌డాక్ సంస్థ కేవ‌లం హిందీ వ‌ర‌కే ప‌రిమితం చేసింది. మ‌రి నెటి జ‌నులు అభ్య‌ర్ధ‌న‌ను మ‌డాక్ ఫిల్మ్స్ క‌న్సిడ‌ర్ చేస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి. మ‌డాక్ ఫిల్మ్స్ ప్ర‌స్తుతం పుల్ ఫామ్ లో ఉంది. గ‌త ఏడాది `స్త్రీ 2`తో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. 50 కోట్ల‌లో నిర్మించిన సినిమా 800 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.