సాయి పల్లవి.. ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలు!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. తన అందం, అభినయంతో రోజురోజుకూ అభిమానులు పెంచుకుంటున్నారు కేరళ కుట్టీ.
By: Tupaki Desk | 10 Nov 2024 9:30 PM GMTనేచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. తన అందం, అభినయంతో రోజురోజుకూ అభిమానులు పెంచుకుంటున్నారు కేరళ కుట్టీ. తనకు అన్ని విధాలుగా నచ్చిన ప్రాజెక్టులను మాత్రమే ఎంచుకుంటున్నారు. వాటి ద్వారా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తన సెలెక్షన్ అంటే ఇలా ఉంటుందని ప్రూవ్ చేసుకుంటున్నారు. తన అప్ కమింగ్ చిత్రాల వైపు అందరి దృష్టిని తిప్పుకుని బిజీ బిజీగా ఉంటున్నారు.
అయితే ఫేమస్ డ్యాన్స్ షో ఢీ లో కంటెస్టెంట్ గా అందరినీ మెప్పించిన కొంత కాలం తర్వాత.. ప్రేమమ్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ మలయాళం మూవీలో టీచర్ రోల్ లో అలరించారు. ఆ తర్వాత వరుసగా కోలీవుడ్ లో ఛాన్సులు అందుకున్నారు. టాలీవుడ్ లోకి భానుమతి ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల అంటూ ఫిదా చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. పక్కింటి అమ్మాయిలా తెలుగు సినీ ప్రియులకు బాగా దగ్గరయ్యారు సాయి పల్లవి.
ఫిదా తర్వాత టాలీవుడ్ లో చేసిన దాదాపు అన్ని సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు అమ్మడు. దీంతో గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు నార్త్ టు సౌత్ ఫుల్ క్రేజ్ దక్కించుకున్నారు. తన సినిమాలు వస్తున్నాయంటే చాలు సినీ ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. రీసెంట్ గా అమరన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో తండేల్.. బాలీవుడ్ లో రామాయన్ మూవీతో బిజీగా ఉన్నారు.
ఇదంతా బాగానే ఉన్నా.. సాయి పల్లవి ఓ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. అందుకు ఎగ్జాంపుల్ కూడా వివరిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన అమరన్ మూవీ సక్సెస్ మీట్, తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్ లో సాయి పల్లవి సందడి చేశారు. ఆయా ఈవెంట్స్ కు మేకర్స్.. మీడియా ప్రతినిధులతో పాటు ఫ్యాన్స్ కు ఎంట్రీ ఇచ్చారు.
అయితే సాయి పల్లవి మాట్లాడుతున్నంత సేపు.. ఆమె ఫ్యాన్స్ ఫుల్ సందడి చేశారు. చప్పట్లతో హోరెత్తించారు. ఓ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తూ రచ్చ చేశారు. అది అభిమానమే అయినా.. కొందరు హీరోలకు అది నచ్చకపోవచ్చని నెటిజన్లు చెబుతున్నారు. సాయి పల్లవి పక్కన ఉండే ఫోకస్ ఆమె వైపు వెళ్లిపోతుందనే ఆలోచన రావచ్చని అభిప్రాయపడుతున్నారు. అలా కొన్నిసార్లు ఆమెకు మూవీ ఛాన్సులు మిస్ అవుతాయేమోనని అంటున్నారు. అది నిజమని చెప్పలేం గానీ.. సాయి పల్లవి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని చెబుతున్నారు.