ఆయన సలహాలు మానేసి బ్లాక్ బస్టర్ తీస్తేనే మంచిది!
గడిచిన నాలుగైదేళ్లలో విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాలన్నీ చెత్త సినిమాలేనని వ్యాఖ్యానించారు సుజీత్ సిర్కార్.
By: Tupaki Desk | 23 Nov 2024 9:19 AM GMTగడిచిన నాలుగైదేళ్లలో విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాలన్నీ చెత్త సినిమాలేనని వ్యాఖ్యానించారు సుజీత్ సిర్కార్. ఆయన తాను ప్రయోగాత్మక సినిమాలు మాత్రమే చేస్తానని కూడా అన్నారు. పా, చినీకమ్ లాంటి ప్రయోగాలతో పాటు, ఇప్పుడు అభిషేక్ బచ్చన్ తో `ఐ వాంట్ టు టాక్` అనే మరో ప్రయోగం చేసాడు అతడు.
కానీ ఈ సినిమాని వీక్షించేందుకు జనం థియేటర్లకు రాలేదు. అలాగే `ఐ వాంట్ టు టాక్` కమర్షియల్ సినిమా కాదు. అది సుజీత్ మార్క్ సినిమా కావడంతో జనం లైట్ తీస్కున్నారు. అవార్డులు కొల్లగొట్టే సినిమాలు ఎప్పుడూ ప్రజల్ని థియేటర్లకు రప్పించలేవు అని చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. ఇప్పుడు కూడా సుజీత్ సిర్కార్ అలాంటి ప్రయత్నమే చేసాడని భావించాలి. సినిమాలో కంటెంట్ బావున్నా ఇది కమర్షియల్ ఫార్మాట్ సినిమా కాదని విమర్శలొచ్చాయి. ప్రజలలో ఒక వర్గం ఇది ఎవరికైనా స్ఫూర్తినిచ్చే మంచి చిత్రం అని ప్రశంసించడమే గాక ఎమోషనల్ కనెక్షన్‌ని ఏర్పరుస్తుందని పొగిడారు. అయితే మరొక వర్గం నుంచి ప్రతికూల స్పందన కూడా వచ్చింది. ప్రథమార్థం ఆశించినంత బాలేదని విమర్శలొచ్చాయి. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద కాసులు ఆశించినంతగా రాలలేదు. పెద్ద తెరపై వచ్చిన ఓ సాధారణ OTT మూవీని చూసేందుకు జనం థియేటర్లకు రావడం సులువు కాదని కూడా సూచిస్తున్నారు.
అందుకే సుజీత్ ఇతరులను విమర్శించే కంటే తన సినిమాలను విశ్లేషించుకుంటేనే బేషుగ్గా ఉంటుందని ప్రజలు సూచిస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ గా వర్కవుటయ్యే సినిమా ఒక్కటైనా చేసి ఉంటే, ఆ తర్వాత అతడి కెరీర్ గ్రాఫ్ బాగుపడుతుందని కూడా సూచిస్తున్నారు. అమితాబ్, అభిషేక్ బచ్చన్ లతో అతడు ప్రయోగాలు చేయడమేనా? ఇంకా ఇతర క్రేజీ హీరోలతో పని చేస్తాడో లేదో వేచి చూడాలి.