Begin typing your search above and press return to search.

స్టార్ హీరో- డైరెక్ట‌ర్ అబ‌ద్ధపు క‌ట్టు క‌థ‌ల ఫ‌లితం!

ఏదైనా చెబితే అందులో కొంతైనా నిజం ఉండాలి. కేవ‌లం క‌ట్టుక‌థ‌లు చెబితే వాటిని దాచి ఉంచ‌డం చాలా క‌ష్టం.

By:  Tupaki Desk   |   2 Feb 2025 8:30 PM GMT
స్టార్ హీరో- డైరెక్ట‌ర్ అబ‌ద్ధపు క‌ట్టు క‌థ‌ల ఫ‌లితం!
X

ఏదైనా చెబితే అందులో కొంతైనా నిజం ఉండాలి. కేవ‌లం క‌ట్టుక‌థ‌లు చెబితే వాటిని దాచి ఉంచ‌డం చాలా క‌ష్టం. పైగా తెర‌పై క్లియ‌ర్ క‌ట్ గా విజువ‌ల్స్ క‌నిపిస్తుండ‌గా, దాని గురించి ప్రేక్ష‌కుల‌కు అబ‌ద్దం చెప్పాలనుకుంటే అది త‌మ‌ను తాము మోసం చేసుకోవ‌డ‌మే. ఇప్పుడు అలాంటి అబ‌ద్ధాలు, క‌ట్టుక‌థ‌ల‌తో బుక్క‌యిపోయారు ప్ర‌ముఖ హీరో, అత‌డి డైరెక్ట‌ర్.

తాము రీమేక్ చేయ‌డం లేద‌ని, కేవ‌లం స్ఫూర్తిగా తీసుకుని ఒక కొత్త క‌థ‌ను ఆడియెన్ కి చూపిస్తున్నామ‌ని చెప్పారు 'దేవా' ద‌ర్శ‌కుడు ఆండ్రూ, అందులో న‌టించిన‌ స్టార్ హీరో షాహిద్. కానీ వారు త‌మ ప్రామిస్ ని నిలబెట్టుకోలేక‌పోయార‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. 'దేవా' ఇటీవ‌ల విడుద‌లై తొలి మూడు రోజుల్లో కేవ‌లం 20 కోట్ల లోపు మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగింది. ఈ సినిమా కంటెంట్ లో మ్యాట‌ర్ లేద‌ని తేలిపోవ‌డంతో స‌మీక్ష‌కులు విరుచుకుప‌డ్డారు. ఫ‌లితంగా `దేవా` బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా మార‌నుంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఈ సినిమాలో క్లైమాక్స్ ఏమిటో త‌న‌కు కూడా తెలీద‌ని, ఒక‌టికి మించి క్లైమాక్స్ ల‌ను ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించార‌ని షాహిద్ ప‌దే ప‌దే ఇంట‌ర్వ్యూలలో ఊద‌ర‌గొట్టాడు. కానీ అదంతా ఉత్తుత్తేన‌ని తేలిపోయింది. అలాగే మ‌ల‌యాళ హిట్ చిత్రం ముంబై పోలీస్ ని య‌థాత‌థంగా మక్కీకి మ‌క్కీ దించేశార‌ని కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయినా ఇది పూర్తిగా కొత్త‌ద‌నంతో తెర‌కెక్కింద‌ని ద‌ర్శ‌కుడు, హీరో బుకాయించార‌ని ఆరోపిస్తున్నారు. చేసిన ప్ర‌మోష‌న్స్ కి సినిమాలో కంటెంట్ కి చాలా తేడా ఉంద‌నేది విమ‌ర్శ‌కుల మాట‌. మొత్తానికి వారి క‌ట్టుక‌థ‌లు ప్రాక్టిక‌ల్ గా బాక్సాఫీస్ స‌క్సెస్‌ని అందించ‌డంలో ఫెయిల‌య్యాయి.