Begin typing your search above and press return to search.

లేడీ కాప్‌ని ఇలా ఊహించ‌లేదు

సింగం ఎగైన్ లో దీపికా పదుకొణె లుక్, యాసపైనా నెటిజ‌నులు సెటైర్లు వేస్తున్నారు. పంచ్ లు విసురుతున్నారు.

By:  Tupaki Desk   |   9 Oct 2024 6:55 AM GMT
లేడీ కాప్‌ని ఇలా ఊహించ‌లేదు
X

సింగం ఫ్రాంచైజీ సినిమాల‌కు ప్ర‌త్యేకించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త‌మిళ ద‌ర్శ‌కుడు హ‌రి రూపొందించిన సౌత్ ఫ్రాంఛైజీ సింగం కి రీమేక్ వెర్ష‌న్ ల‌ను తెర‌కెక్కించ‌డంలో రోహిత్ శెట్టి ఎంతో పాపుల‌ర‌య్యారు. సింగం థీమ్ తీసుకుని హిందీలో కొత్త క‌థ‌ల్ని రాస్తున్నాడు శెట్టి. పూర్తిగా బాలీవుడ్ న‌టీన‌టుల‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు.

సింఘం ఎగైన్ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఇది సూపర్-హిట్ ఫ్రాంచైజీ లో మూడో భాగం. సింగం, సింగం 2, సింబా, సూర్యవంశీ లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో అందించాడు. ఈ యూనివ‌ర్శ్ లో సింగం ఎగైన్ ఐదవ భాగం. అంటే ఫ్రాంఛైజీలో మూడోది అయినా యూనివ‌ర్శ్ లో ఐద‌వ‌ది.

ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌లైంది. కానీ ఈ ట్రైల‌ర్ కి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. పోలీసులు ఒక‌రికి మించి ఎక్కువ‌మంది క‌నిపించ‌డ‌మే గాక‌, వారంతా పాపులర్ స్టార్లు కావ‌డంతో కొంత గంద‌ర‌గోళం నెల‌కొంది. అలాగే సింగం ఎగైన్ లో దీపికా పదుకొణె లుక్, యాసపైనా నెటిజ‌నులు సెటైర్లు వేస్తున్నారు. పంచ్ లు విసురుతున్నారు. అజయ్ దేవగన్, కరీనా కపూర్, రణవీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ సహా ప‌లువురు స్టార్లు ట్రైల‌ర్ లో క‌నిపించ‌గా, దీపిక పాత్ర‌ను ఎలివేట్ చేసిన తీరు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

దీపికా పదుకొనే కాప్ అవతార్ ని 'క్రింజ్' అని కామెంట్ చేసారు. శక్తి శెట్టి అనే కాప్ గా క‌నిపించే దీపిక ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తుందని అంచ‌నా వేసిన వారు నిరాశ‌ప‌డ్డారు. త‌న భాష యాస నెటిజ‌నుల‌కు అంత‌గా న‌చ్చ‌లేదు. దీంతో ట్రోలర్లు విరుచుకుప‌డుతున్నారు. రణవీర్ సింగ్ లాగా మారిందని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించగా, ఈ ట్రైలర్‌కు ఇంటర్వెల్ బ్రేక్ లా మారింద‌ని మ‌రొక‌రు కామెంట్ చేసారు. అలాగే న‌య‌న‌తార కాప్ లుక్ తో పోలిక చూపిస్తూ కొన్ని ఫోటోల‌ను కూడా నెటిజ‌నులు షేర్ చేసారు. ప్ర‌స్తుతం ఇవ‌న్నీ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.