Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్, లావణ్య వివాదం… ఇంకెంత కాలం?

ఈ న్యూస్ మాత్రమే తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అనే విధంగా మొత్తం హైలైట్ చేస్తూ ఉండటం విశేషం.

By:  Tupaki Desk   |   5 Aug 2024 5:47 AM GMT
రాజ్ తరుణ్, లావణ్య వివాదం… ఇంకెంత కాలం?
X

తెలుగు రాష్ట్రాలలో హీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య మధ్య కొనసాగుతోన్న వివాదం ఆరోపణలు, ప్రత్యారోపణలుతో నడుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఇదే హాట్ టాపిక్ గా ఇప్పుడు మీడియాలో కనిపిస్తోంది. వీరిద్దరి వివాదం మీదనే అందరి దృష్టి పడేలా చేస్తున్నారు. రాజ్ తరుణ్ మీద లావణ్య చేస్తోన్న ఆరోపణలు, ఆమె పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులని హైలైట్ చేస్తున్నారు. అలాగే రాజ్ తరుణ్ లావణ్య మీద డ్రగ్ ఎడిక్ట్ కావడమే కాకుండా చాలా మందికి ఆమె డ్రగ్స్ సప్లై చేస్తుందని ఆరోపించారు.

చాలామందికి ఆమె డ్రగ్స్ అలవాటు చేసి తరువాత రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తోందని రాజ్ తరుణ్ తరుపున ఫైట్ చేస్తోన్న శేఖర్ భాషా ఆరోపణలు చేస్తున్నారు. శేఖర్ భాషాని ఆమె చెప్పుతో కొట్టడంతో ఈ వివాదం మరింత తీవ్రంగా మారింది. శేఖర్ భాషా, లావణ్య వ్యక్తిగతంగా ఈ గొడవని తీసుకొని మీడియా ముందుకొచ్చి రచ్చ చేస్తున్నారు. తాజాగా లావణ్య తన మీద శేఖర్ భాషా దాడి చేసాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది. అలాగే శేఖర్ భాషా కూడా లావణ్య మనుషులు తనపై దాడి చేశారని ఏకంగా హాస్పిటల్ లో జాయిన్ అయిపోయాడు.

ఈ న్యూస్ మాత్రమే తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అనే విధంగా మొత్తం హైలైట్ చేస్తూ ఉండటం విశేషం. యుట్యూబ్ ఓపెన్ చేస్తే ఏ ఛానల్ చూసిన లైవ్ పెట్టి మరి వీరి గొడవని చూపిస్తున్నారు. దేశంలో ఓ వైపు కేరళలో వయనాడ్ విపత్తు ఇంకా చాల సమస్యలు ఉన్నాయ్ . అయితే రాజ్ తరుణ్, లావణ్య వ్యక్తిగత గొడవ చుట్టూనే మీడియా అందరి ఫోకస్ నడుస్తోంది. రోజు రోజుకి ఈ గొడవ మరింత శృతి మించుతూ భౌతిక దాడుల వరకు వెళ్తుందనే మాట వినిపిస్తోంది.

నిజానికి ఇద్దరి వ్యక్తిగత గొడవ చుట్టూ పబ్లిక్ అటెన్షన్ పడేలా చేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదనే మాట వినిపిస్తోంది. ప్రజలకి కూడా ఈ ఇష్యూ ప్రస్తుతం బోరింగ్ అంశంగా మారిపోయిందని టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. యుట్యూబ్ ఓపెన్ చేస్తే రాజ్ తరుణ్, లావణ్య, శేఖర్ భాషా గొడవలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చట్టపరంగా రాజ్ తరుణ్, లావణ్య తేల్చుకునే సమస్యకి ఇంత పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు.

దేశంలో దీనికంటే పెద్ద పెద్ద ఇష్యూస్ నడుస్తున్నాయని, వాటిని పబ్లిక్ దృష్టికి కాస్తా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వయనాడ్ విపత్తులాంటి వాటిని హైలైట్ చేస్తే మన సెలబ్రెటీలు చేస్తోన్న సహాయం అందరికి తెలుస్తుందని సూచిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో పబ్లిక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అవగాహన కల్పించవచ్చని అంటున్నారు. అలాగే వయనాడ్ బాధితులకి సాయం చేయడంలో పబ్లిక్ ని కూడా భాగస్వామ్యం చేయొచ్చని కొంతమంది మేధావులు చెబుతున్నారు.