Begin typing your search above and press return to search.

ఐశ్వ‌ర్యారాయ్ అందంపై నెటిజ‌నుల ఎటాక్

ప్ర‌జ‌ల‌కు అందాన్ని విమ‌ర్శించ‌డం చాలా సులువు. విద్యావంతులు వివేక‌వంతులు కూడా ఈ ఉచ్చులో ప‌డ‌తారు.

By:  Tupaki Desk   |   8 Oct 2023 2:53 PM GMT
ఐశ్వ‌ర్యారాయ్ అందంపై నెటిజ‌నుల ఎటాక్
X

ప్ర‌జ‌ల‌కు అందాన్ని విమ‌ర్శించ‌డం చాలా సులువు. విద్యావంతులు వివేక‌వంతులు కూడా ఈ ఉచ్చులో ప‌డ‌తారు. ఇప్పుడు మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ వంతు. ఐష్ అందం ఇప్పుడు క్రిటిక్స్ రాడార్ లోకి వ‌చ్చింది. ఆమె అందంగా క‌నిపించ‌డం కోసం ఫోటోషాప్ చేయించిన ఫోటోల‌ను షేర్ చేసింది అంటూ ఒక వ‌ర్గంలో చ‌ర్చ సాగుతోంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇటీవల పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసారు. అక్కడ త‌న లుక్ పై మిశ్రమ స్పందనలు ద‌క్కాయి. ఐష్ ఎంపిక‌ల‌ను ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు. దుస్తులు, లుక్ ప‌రంగా ట్రోలింగ్ ని ఎదుర్కొంది. రూపం పూర్తిగా మారిపోయింద‌ని, బ‌రువు బాగా పెరిగింద‌ని కామెంట్లు చేసారు. కార‌ణాలు ఏవైనా కానీ.. అవ‌న్నీ ఫోటోషాప్ చేసిన ఫోటోలు అంటూ విమ‌ర్శిస్తున్నారు.

ఇన్ స్టాలో ఐష్ నిరంత‌రం త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని ఐశ్వ‌ర్యారాయ్ షేర్ చేస్తున్నారు. దాదాపు కోటి 30ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్ల‌తో ఇన్ స్టాలో టాప్ పొజిష‌న్ లో ఉన్న ఐష్ కి సంబంధించిన ప్ర‌తిదీ క్ష‌ణాల్లో వైరల్ అయిపోతోంది. తాజాగా మాజీ ప్ర‌పంచ సుంద‌రి షేర్ చేసిన ఫోటోషూట్ పై క్ష‌ణాల్లో ట్రోలింగ్ వైర‌ల్ అయింది. బ్లాక్ డ్రెస్ లో ఐష్ ఎంతో అందంగా క‌నిపించినా ట్రోల‌ర్స్ మాత్రం వ‌దిలిపెట్ట‌లేదు. అవి ఫోటోషాప్ చేసిన‌ మార్ఫ్ డ్ ఫోటోలు అని కొంద‌రు అనుమానిస్తున్నారు.

ఐశ్వర్య మూడు హార్ట్ ఎమోజీలతో పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. కానీ ఈ ఫోటోలు నెటిజన్‌లకు అంత‌ బాగా నచ్చలేదు. `` చూడ‌టానికి బొమ్మలా ఉంది. ఇది ఐష్‌ ముఖం కాదు..`` అని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఒక నెటిజ‌న్.. వయస్సుతో పాటు బరువు పెరగడాన్ని ప్రజలు ఎందుకు అంగీకరించరు? నా ఉద్దేశ్యం ఇంత చదువుకున్న స్త్రీ కూడా `అందాల కుంచె`(అందం అనే వ‌ర్ణ‌న‌)లో పడుతుంద‌ని అనుకోను! .. అని ఒక‌రు వ్యాఖ్యానించారు. ఈ ఫోటోషూట్ చాలా ఫోటోషాప్ చేసిన‌ది.. అని ఒక‌రు వ్యాఖ్యానించారు. కొంచెం అసురక్షితంగా ఉండవచ్చని నేను అర్థం చేసుకున్నాను.. కానీ వయస్సు పెరిగేకొద్దీ ప్రతి ఒక్కరి శరీరం మారుతుంది. యూత్ ని కాద‌నుకుని ఐష్‌ వైపు చూస్తారని నేను అనుకోను అని ఒక‌రు వ్యాఖ్యానించారు. అయితే ఐశ్వ‌ర్యారాయ్ భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ .. ఏస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రెడ్ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేయ‌డం కొంత ఊర‌ట‌.

హాలీవుడ్ స్టార్ల‌తో ర్యాంప్ వాక్:

ప్యారిస్ ఫ్యాష‌న్ వీక్ వేదిక వ‌ద్ద‌ ఐశ్వర్యరాయ్‌ అంతర్జాతీయ మోడల్ టాప్ హాలీవుడ్ సెల‌బ్రిటీ కెండల్ జెన్నర్, చైనీస్ నటుడు గాంగ్ జున్ .. ప్రశంసలు పొందిన బ్రిటిష్ నటి హెలెన్ మిర్రెన్‌లతో కలిసి పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడిచింది. ఈఫిల్ టవర్ సమీపంలోని రన్‌వేపై ఈ నడక కొన‌సాగింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. చివరిసారిగా మణిరత్నం దర్శకత్వం వహించిన 2023 తమిళ హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రం `పొన్నియిన్ సెల్వన్: II`లో కనిపించింది. ఈ సినిమాలో ఐశ్వ‌ర్యారాయ్ మునుప‌టి ఛామ్ తో ఎంతో అందంగా క‌నిపించింది.