గల్లా ఫ్యామిలీ నుంచి మరో హీరోనా!
అయితే అతడు స్థిరపడక ముందే గల్లా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు మ్యాకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.
By: Tupaki Desk | 2 Jan 2025 6:04 AM GMTసూపర్ స్టార్ మహేష్ మేనల్లుడిగా అశోక్ గల్లా నటుడిగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. `హీరో` సినిమాతో లాంచ్ అయ్యాడు. కానీ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. ఇక రెండవ ప్రయత్నంగా ఇటీవలే ప్రశాంత్ వర్మ కథ అందించిన `దేవకీ నందవాసుదేవ`తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. అలా రెండు సినిమాలతో గల్లా వారబ్బాయికి వైఫల్యం తప్పలేదు. ప్రస్తుతం మూడవ సినిమా ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు.
వెనుక నుంచి మంచి బ్యాకప్ ఉండటంతో ఎలాగైనా ఇండస్ట్రీలో స్థిరపడాలని సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తు న్నాడు. అయితే అతడు స్థిరపడక ముందే గల్లా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు మ్యాకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. అశోక్ సోదురుడు గల్లా సిద్దార్ద్ ఎంట్రీకి రంగం సిద్దమవుతోంది. రచయిత గోపీ మోహన్ సిద్దార్ద్ ఎంట్రీకి తగ్గ స్టోరీ సిద్దం చేస్తున్నాడుట. ఇదే ఏడాది సిద్దార్ధ్ లాంచింగ్ ఉంటుందంటున్నారు.
అయితే ఈ సినిమాకి గోపీ మోహన్ కూడా దర్శకుడిగా పరిచయం అవుతాడా? లేక కథ తోనే సరిపెడతాడా? అన్నది చూడాలి. గోపీ మోహన్ చాలా సినిమాలకు రైటర్ గా పనిచేసారు. కమర్శియల్ గా ఆ సినిమాలు మంచి విజయాన్ని అందించాయి. ఈ నేపథ్యంలో గల్లా వారసుడి బాధ్యతలు అతడిపై పెట్టినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గా మారాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు. కానీ ఇంతవరకూ అటుగా టర్నింగ్ తీసుకోలేదు.
మరి ఇప్పుడైనా కెప్టెన్ కుర్చి ఎక్కుతాడా? లేక ప్రాజెక్ట్ ని సెట్ చేయడం వరకే పరిమితం అవుతాడా? అన్నది చూడాలి. గోపీ మోహన్ ప్రస్థానం అసిస్టెంట్ డైరెక్టర్ గానే మొదలైంది. 1999లో `యమజాతకుడు` సినిమాకి అసిస్టెంట్ గా పనిచేసాడు. ఆ తర్వాత `వంశీ`, `నువ్వు నేను` చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. అటుపై `సంతోషం` సినిమాతో స్క్రీన్ ప్లే రైటర్ గా, `రెడీ` సినిమాతో స్టోరీ రైటర్ గా మారారు. కామెడీ స్టోరీలు రాయడంలో గోపీ మోహన్ కి ప్రత్యేక మైన గుర్తింపు ఉంది. మరి గల్లా వారసుడి డెబ్యూ కామెడీ సినిమా అవుతుందా? సీరియస్ యాక్షన్ స్టోరీ రాస్తున్నాడా? అన్నది తెలియాలి.