సినిమా టికెట్ ధరలు.. ఏపీలో కొత్త విధానం?
ఈ మేరకు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తో జరిగిన సమావేశంలో పవన్ కీలక సూచనలు చేశారు.
By: Tupaki Desk | 29 Dec 2024 11:30 AM GMTసాధారణంగా బడా సినిమాల టికెట్ ధరలు పెంచాలని రిలీజ్ కు కొద్ది రోజుల ముందు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆయా మేకర్స్ కోరడం.. ఆ తర్వాత అందుకు సంబంధించిన జీవోలు పొందడం.. రేట్లను పెంచడం.. ఇవన్నీ తెలిసిందే. పెద్ద చిత్రాల విషయంలో ఈ ప్రాసెస్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
అయితే టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రీసెంట్ గా సినీ ఇండస్ట్రీలో డైనమిక్ టిక్కెట్ ప్రైసింగ్ సిస్టమ్ ను అమలు చేయాలని సూచించారు. అందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని కోరారు. ఈ మేరకు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తో జరిగిన సమావేశంలో పవన్ కీలక సూచనలు చేశారు.
ఆ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు రీసెంట్ గా రెవీల్ చేశారు. టికెట్ పెంపు పర్మిషన్ల కోసం నిర్మాతలు హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ప్రతిసారి ప్రయాణించడం సబబు కాదని పవన్ చెప్పినట్లు బన్నీ వాసు తెలిపారు. డైనమిక్ టిక్కెట్ ధరలను అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికతో ప్రతిపాదనను రూపొందించాలని కోరినట్లు చెప్పారు.
టికెట్ ధరలను నిర్ణయించే వెసులుబాటు నిర్మాతలకు ఉండాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు బన్నీ వాసు తెలిపారు. టిక్కెట్ ధరలపై ప్రైస్ కాప్ ఉండాలని తాము చెప్పినట్లు అన్నారు. సింపుల్ గా చెప్పాలంటే.. వీక్ డేస్ లో టికెట్స్ ధరలు తగ్గించి.. వీకెండ్ లో ప్రీమియం ధరలు ఉండాలని అన్నట్లు చెప్పామని బన్నీ వాసు తెలిపారు.
ఇప్పటికే ముంబై, బెంగళూరులో ఆ విధానం అమలులో ఉందని తెలిపారు. ఇప్పుడు ఆ ధరల విధానాన్ని ఆమోదించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ నిర్మాతల సంఘం నుండి జాప్యం జరుగుతోందని చెప్పారు. నిర్మాతలు ప్రతి సినిమా కోసం కష్టపడి సంబంధిత మంత్రిని కలవడం పవన్ గారికి ఇష్టం లేదని అన్నారు.
ప్రతిపాదన సిద్ధమైన తర్వాత పవన్ కళ్యాణ్ ను కలుస్తామని బన్నీ వాసు తెలిపారు. మొత్తానికి ఏపీలో కొత్త టికెట్ ధరల విధానం అమలులోకి రావడం దాదాపు ఖరారు అయినట్లు కనిపిస్తుంది. ప్రతిపాదన సిద్ధం అయ్యాక.. నిర్మాతలు కలవడమే లేటు అని తెలుస్తోంది. మరి చూడాలి ఎప్పుడు కొత్త విధానం అమల్లోకి వస్తుందో..