కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరంటే..!
తెలుగు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల అవుతూ ఉన్నా కూడా మేకింగ్ కు సంబంధించిన ఎక్కువ వర్క్ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది.
By: Tupaki Desk | 9 Dec 2023 6:49 AM GMTతెలుగు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల అవుతూ ఉన్నా కూడా మేకింగ్ కు సంబంధించిన ఎక్కువ వర్క్ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో టాలీవుడ్ అనేది ఎక్కువ ఉందని చెప్పుకోవాలి.
రాష్ట్రం విడిపోయిన తర్వాత సినిమా పరిశ్రమ ను మీరంటే మీరు పట్టించుకోవాలి అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా నంది అవార్డులను గతంలో మాదిరిగా ఇచ్చిందే లేదు.
తాజాగా తెలంగాణలో కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయింది. అంతకు ముందు వరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫి మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు ఆ బాధ్యతలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది.
కొత్త సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ టాలీవుడ్ కి ఎంత మేరకు సహకారం అందిస్తూ, సినీ కార్మికులకు సంక్షేమం అందిస్తుంది అనేది చూడాలి. ముఖ్యంగా అంతా కోరుకుంటున్న నంది అవార్డులను కనీసం ఈ ప్రభుత్వం అయినా ఇస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో చివరి సారి కాంగ్రెస్ పార్టీనే నంది అవార్డులు ఇచ్చిన విషయం తెల్సిందే. త్వరలోనే టాలీవుడ్ ప్రముఖులు నంది అవార్డుల గురించి, టాలీవుడ్ లో ఉన్న ఇతర సమస్యల గురించి మంత్రి కోమటిరెడ్డిని కలిసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.