Begin typing your search above and press return to search.

SSMB 29.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..

SSMB 29 టీమ్ కు సంబంధించి మరో ఫోటో కూడా బయటకొచ్చింది. ఇందులో మహేష్, రాజమౌళితో పాటు మరికొందరు ఉన్నారు.

By:  Tupaki Desk   |   19 April 2024 1:27 PM GMT
SSMB 29.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..
X

2024 సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... తన నెక్స్ట్ మూవీ దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని, మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని రాజమౌళి తండ్రి, SSMB 29 రచయిత విజయేంద్ర ప్రసాద్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. అందుకు జక్కన్న ఫుల్ ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల దుబాయ్ నుండి తిరిగి వస్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు, నిర్మాత కేఎల్ నారాయణతో కలిసి రాజమౌళి కనిపించారు.

దుబాయ్ లో ఈ సినిమా సిట్టింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. సిట్టింగ్స్ పూర్తవడంతో మూవీ టీమ్ హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. SSMB 29 టీమ్ కు సంబంధించి మరో ఫోటో కూడా బయటకొచ్చింది. ఇందులో మహేష్, రాజమౌళితో పాటు మరికొందరు ఉన్నారు. దీంతో ఈ పిక్ ను మహేష్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కొత్త లుక్ తో మహేష్ ఖతర్నాక్ గా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. లాంగ్ హెయిర్ తో అదిరిపోయారని అంటున్నారు.

ఇక మహేష్ బాబు- రాజమౌళి పిక్స్, వీడియాస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో జక్కన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు. త్వరలోనే క్రేజీ అప్డేట్ రానుందమోనని ఇంకొందరు అంటున్నారు. ఈ నెలలో అనౌన్స్మెంట్ ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి నెట్టింట ఎక్కడ చూసినా మహేష్ బాబు- రాజమౌళి సినిమా గురించే చర్చ నడుస్తోంది.

ఈ సినిమా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. అందుకు తగ్గ లొకేషన్స్ ను ఆల్రెడీ జక్కన్న ఫిక్స్ చేశారట. ఈ మూవీలో మహేష్ క్యారెక్టర్ కు హనుమంతుడితో సమానమైన లక్షణాలు ఉంటాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అడవిలో అన్ని అసమానతలతో పోరాడిన ఓ వ్యక్తి చరిత్ర ఈ చిత్రంలో ఉండనున్నట్లు టాక్ వినిపించింది. మరి వీటన్నింటిపై జక్కన్న ఎప్పుడు క్లారిటీ ఇస్తారో, సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.