Begin typing your search above and press return to search.

కొత్త కుర్రాళ్లు చెక్ ఒన్స్..మ‌న‌లో అంత స్ట‌ప్ ఉందా!

లొకేష్ క‌న‌గ‌రాజ్..అట్లీ...చందు మొండేటి..సైలేష్ కొల‌ను లాంటి యంగ్ మేక‌ర్స్ ని ఇనిస్పేర‌ష‌న్ గా చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Oct 2023 11:30 PM GMT
కొత్త కుర్రాళ్లు చెక్ ఒన్స్..మ‌న‌లో అంత స్ట‌ప్ ఉందా!
X

సినిమా ట్రెండ్ మారింది. ట్రెండ్ కి తగ్గ‌ట్టు స్టోరీలుండాలి..మేకింగ్ ఉండాలి. కొత్తొళ్లు ఎవ‌రొచ్చినా? త‌న‌కం టూ ఓ ప్ర‌త్యేక‌మైన బ్రాండ్ ఐడెంటిటీ వేసే స‌త్తా ఉండాలి. ఓల్డ్ ఫార్మెట్ లో సినిమాలు చేద్దామంటే కుద‌ర‌దు. ఆరు పాట‌లు..నాలుగు ఫైట్ల‌తో గ‌ట్టెక్కిచిద్దేం అనుకుంటే కుద‌ర‌దు. యూనిక్..ఇన్నోవేటివ్ ఐడియాలిజం ఉండాలి. ఎంపిక చేసుకునే స్టోరీల్లో వైవిథ్య‌త ఉండాలి. త‌మ‌కంటూఓ యూనివ‌ర్శ్ ని క్రియేట్ చేసుకోవాలి.

మారుతోన్న ప్రేక్ష‌కుల ప‌ల్స్ ని ప‌ట్టుకుని సినిమాలు చేయాలి. ఇవ‌న్నీ ఇప్పుడొస్తున్న కొత్త త‌రం మేక‌ర్స్ లో త‌ప్ప‌క ఉండాల్సిన ల‌క్ష‌ణాలు. అస‌లు ఇండ‌స్ట్రీకి వ‌చ్చే ముందు మ‌న‌లో స్ట‌ప్ ఎంత అన్న‌ది చెక్ చేసుకో వ‌డం మంచిదంటున్నారు సినిమా నిపుణులు. క్రియేటివ్ ప‌రంగా తీవ్ర‌మైన పోటీ ఉంది. ఆ పోటీని త‌ట్టుకుని నిల‌బడాలంటే యూనిక్ గా ఉండాలి. అది లేక‌పోతే హీరోలు స్టోరీలు కూడా విని ప‌రిస్థితి లేదు.

లొకేష్ క‌న‌గ‌రాజ్..అట్లీ...చందు మొండేటి..సైలేష్ కొల‌ను లాంటి యంగ్ మేక‌ర్స్ ని ఇనిస్పేర‌ష‌న్ గా చూపిస్తున్నారు. వాళ్ల త‌ర‌హాలో ఐడియాలిజం ఉండాలంటున్నారు. వాస్త‌వానికి ఇప్పుడున్న సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు రాక‌పోవ‌డ‌నికి కార‌ణం అప్ డేట్ గా లేక‌పోవ‌డ‌మే. ఓల్డ్ ఫార్మెట్ కి అల‌వాటు ప‌డిపోయి ..కొత్త పార్మేట్ లో తీయ‌లేక వెనుక‌బ‌డిని ద‌ర్శ‌కుల్ని ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తారు.

ఇప్పుడొచ్చే కొత్త కుర్రాళ్లంతా 100 శాతం నాలెడ్జ్ ని ఇండ‌స్ట్రీకి రాక ముందే సంపాదించి రావాలంటు న్నారు. ఇక్క‌డకొచ్చిన త‌ర్వాత అవ‌కాశాల కోసం సీరియ‌స్ గా ప్ర‌య‌త్నం చేయ‌డం త‌ప్ప‌! వ‌చ్చిన త‌ర్వాత టెక్నాల‌జీ గురించి తెలుసుకోవ‌డం..నేర్చుకోవ‌డ వంటి ప‌నులు మొద‌లు పెడితే పుణ్య కాలం కాస్త గ‌డిచిపోతుంద‌ని..అవ‌కాశం వ‌చ్చే స‌రికి వృద్ధాప్యం కూడా వ‌చ్చేస్తుందంటున్నారు.

సందీప్ రెడ్డి వంగ‌...ప్ర‌శాంత్ నీల్..లొకేష్ క‌న‌గ‌రాజ్.. అట్లీ లాంటి వారికి స్టార్ హీరోలు పిలిచి అవ‌కాశం ఇస్తున్నారంటే ? కార‌ణం వాళ్ల‌లో విష‌యం ఉంది కాబ‌ట్టి! హీరోలు ఎంత బిజీగా ఉన్నా మిగ‌తా ద‌ర్శ‌కుల్ని క్యూలో పెట్టి మ‌రీ ముందుగా వంద‌ల కోట్లు వ‌సూళ్లు తెచ్చిన ద‌ర్శ‌కుల్ని ముందు వ‌రుస‌లో నుంచో బెడుతున్నారు. కొత్త కుర్రాళ్లు ఈ విష‌యాల‌న్ని నిశితంగా ప‌రిశిలించాల్సిన అంశాలు.