Begin typing your search above and press return to search.

కొత్త హీరో సూర్య 'RAM' మూవీ.. ఎలా ఉందంటే?

దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా నేడు జనవరి 26న థియేటర్లలో విడుదలైంది.

By:  Tupaki Desk   |   26 Jan 2024 2:00 PM GMT
కొత్త హీరో సూర్య RAM మూవీ.. ఎలా ఉందంటే?
X

సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా కొత్త దర్శకుడు మిహిరామ్ వైనతేయ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్). దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా నేడు జనవరి 26న థియేటర్లలో విడుదలైంది. దేశభక్తికి కమర్షియల్ అంశాలను జోడించి అందరినీ ఆకట్టుకునే చిత్రాలు తీయడం అంటే మాములు విషయం కాదు. తొలి ప్రయత్నంలోనే హీరో, దర్శకుడు రామ్ సినిమాతో ఆ సాహసం చేశారు.

డైరెక్టర్ తీసుకున్న హెచ్‌ఐడీ (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్స్) అనే పాయింట్ కొత్త‌గా ఉందని సినీ ప్రియులు చెబుతున్నారు. ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ బాగుందని రివ్యూలు ఇస్తున్నారు. క్లైమాక్స్ లోని యాక్షన్ సీన్ బాగా చేసారు అని అంటున్నారు. చివర్లో హిందూ అధికారికి, ముస్లిం పౌరుడు సహాయం చేయడం, సాయి కుమార్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయని చెబుతున్నారు. ఓ మంచి దేశభక్తి మూవీ అని అంటున్నారు.

ఈ మూవీలో హీరో కొత్త కుర్రాడు అయినా.. అద్భుతంగా నటించారని కొనియాడుతున్నారు. దేశభక్తి అంటే గిట్టని, అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడిలా కనిపించినప్పుడు.. దేశ భక్తితో ఎదిగిన ఓ సిన్సియర్ ఆఫీసర్‌ గా ఉన్నప్పుడు సూర్య చూపించే వ్యత్యాసం ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. రెండు పాత్రల్లోనూ హీరో అలరించారని అంటున్నారు. యాక్షన్, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌ లోనూ సూర్య నటన సూపర్ అని సినీ ప్రియులు రివ్యూలు ఇస్తున్నారు. ఫైట్ సీన్స్ లో కూడా హీరో బాగా యాక్ట్ చేశారని అంటున్నారు.

భానుచంద‌ర్‌, సాయి కుమార్‌, శుభ‌లేఖ సుధాక‌ర్ వంటి సీనియ‌ర్ ఆర్టిస్టులు ఉండ‌టం ఈ సినిమాకు ప్ల‌స్స‌యిందని నెటిజన్లు చెబుతున్నారు. సాయి కుమార్ డైలాగ్స్ కొత్త ఆలోచ‌న‌లను రేకెత్తిస్తాయని అంటున్నారు. ధ‌న్యా బాల‌కృష్ణ పాత్ర యూత్ ఆడియెన్స్‌ ను మెప్పిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. ధన్య చేసిన ఎమోషనల్ సీన్ సెకండాఫ్‌లో అందరినీ కంటతడి పెట్టిస్తుందని చెబుతున్నారు. రామ్ కోసం ద‌ర్శ‌కుడు మిహిరామ్ ఎంచుకున్న పాయింట్ డిఫ‌రెంట్‌ గా ఉందని సినీప్రియులు చెబుతున్నారు. డైరెక్టర్ కు ఫస్ట్ మూవీ అయినా మంచిగా తెరకెక్కించారని కొనియాడుతున్నారు.

కథేంటంటే?

మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు లెక్కచేయకుండా దేశం కోసం వీర మరణం పొందుతాడు. తమ కోసం మరణించాడంటూ మరో మేజర్ జేబీ (భాను చందర్) ఆ త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. మేజర్ సూర్య ప్రకాష్ కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల) మాత్రం దేశానికి సేవ చేయడం అంటే ఇష్టం ఉండదు. దేశానికి సేవ చేస్తూ తన తండ్రి చనిపోతే దిక్కులేని వాళ్లమయ్యామని, చిన్నతనంలోనూ నాన్న తనతో ప్రేమగా ఉండలేకపోయాడంటూ కోపంతో ఉంటాడు రామ్. అలాంటి రామ్‌ను సూర్య ప్రకాష్ కోరిక మేరిక డిపార్ట్మెంట్‌ లోకి జాయిన్ చేయించడానికి జేబీ చేసిన ప్రయత్నాలు ఏంటి? జేబీ కూతురు జాహ్నవి (ధన్య బాలకృష్ణ)కు ఈ కథలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ఏంటి? ఉగ్ర సంస్థల కుట్రను చివరకు రామ్ అడ్డుకున్నాడా? దేశభక్తి అసలే లేని రామ్. చివరకు దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తిగా ఎలా మారాడు? అన్నదే మిగతా స్టోరీ.